News Beat

Masooda Art Director For Vishwak Sen’s Film

అనతి కాలంలోనే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, కలర్ ఫోటో, మసూద ఇలాంటి సూపర్ హిట్స్ అందుకొని తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ ‘ఆర్ట్ డైరెక్టర్’ గా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ‘వై క్రాంతి కుమార్ రెడ్డి’. అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం తాలూకాలోని శెట్టూరు గ్రామానికి చెందిన క్రాంతి ఒక ‘పల్లెటూరి కుర్రాడు’. ఆంధ్ర – కర్ణాటక సరిహద్దుల్లో నివసించించడంతో కన్నడ భాష వచ్చింది. ఇంట్లో టివి లేకపోవడం, రేడియోలో సినిమా స్టోరీలు, పాటలు వినడంతో సినిమాలపై ప్యాషన్ మొదలైంది. అంతేకాదు, పోస్టర్లు మీద డైరెక్టర్ కావాలని కలలు కనేవాడు, కానీ అంతర్ముఖ స్వభావం వల్ల వెనకడుగు వేస్తు వచ్చేవాడు.

తెలుగు విశ్వవిద్యాలయం నుండి మూడు డిప్లొమాలు మరియు పీజీ (థియేటర్) పూర్తి చేసిన క్రాంతి కుమార్ హైదరాబాద్‌కు అనేక లఘు చిత్రాలకు పనిచేశాడు మరియు నాటకాల కోసం సెట్‌లను రూపొందించాడు. అతని ప్రతిభ చూసి ‘రజాకార్’ 2014-15లో ఉత్తమ సెట్ డిజైనర్‌గా ‘నంది అవార్డు’ను గెలుచుకున్నాడు.

ADVERTISEMENT

నంది అవార్డు తో మొదలైన గెలుపు క్రాంతి కుమార్‌కు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసే అవకాశం వచ్చింది. అలాగే, మసూదా చిత్రానికి ఇంటర్వెల్ సన్నివేశంలో ‘డంప్ యార్డ్’ సెట్ తో ప్రత్యేకంగా ప్రసశంసలు అందుకున్నారు. క్రాంతి కుమార్ నిరంతరం నేర్చుకోవడం మరియు ఎప్పటికప్పుడు కొత్తదనం వాటి మీద దృష్టి పెట్టడం అతని కెరీర్‌కి విజయం సాధించడంలో సహాయపడింది.

సినిమాలో రాణించాలి అంటే ప్రతిభ ఉంటే సరిపోదు, పేషెన్స్ కుడా ఉండాలి. నేను చేసిన ప్రతి సినిమా హిట్ అవ్వడం అది నా అదృష్టంగా భావిస్తాను. ఈ విజయాలన్నింటికీ నా తమ్ముడు, భార్య ప్రధాన కారణం.

కృషి, అంకితభావం మరియు పట్టుదల కలలను సాధించడంలో సహాయపడతాయనడానికి క్రాంతి కుమార్ ప్రయాణం ఒక నిదర్శనం. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామం నుండి ప్రఖ్యాత కళా దర్శకుడిగా అతని సంకల్పంమే ఇంత దూరం తీసుకువచ్చాయి. ప్రస్తుతం ‘పేక మేడలు’ మరియు ‘బహిష్కరణ’ జీ 5 (సిరీస్) రెండు ప్రాజెక్ట్‌లను సెరవేగంగా పూర్తి చేశాడు. అంతేకాదు, రవితేజ బ్యానర్ లో విశ్వక్ సేన్ హీరో గా సినిమా మరియు కొత్తవాళ్లతో కర్నూలు సినిమా బ్యాక్‌డ్రాప్ లో రానున్నాయి. సో, క్రాంతి కుమార్ వరుస అవకాశాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్నాడు

Share
Vishnu Aadi

Vishnu is the Head of Daily Operations at M9 News, where he coordinates the writing team, publishers, and management. With a strong focus on ensuring smooth workflow and seamless collaboration, Vishnu plays a key role…

Published by

Recent Posts

టిట్ ఫర్ టాట్: ఫామ్‌హౌసుకి కాంగ్రెస్‌ వెళ్తే..

తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడివేడిగా జరుగుతాయని అందరూ అనుకుంటే, ఈసారి బయట యుద్ధాలు జరుగుతున్నాయి. మొన్న కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు…

17 minutes ago

Sardar 2: Karthi Already Warned Audience with Indian 2?

Karthi's long pending film Sardar 2 directed by PS Mithran was finally released in theatres…

17 minutes ago