ఈ నెల 29న ‘సోని లివ్’ లో సుహాస్ “ఫ్యామిలీ డ్రామా” విడుదల

Suhas's FAMILY DRAMA Movie premieres on SONY LIV On October 29thఎగ్జైటింగ్ కంటెంట్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న సోని లివ్ ఓటీటీ
మరో థ్రిల్లింగ్ మూవీని రిలీజ్ చేయబోతోంది. ఆ చిత్రమే సుహాస్ హీరోగా
నటించిన “ఫ్యామిలీ డ్రామా”. కలర్ ఫొటో చిత్రంతో విజయాన్ని అందుకున్న యువ
నటుడు సుహాస్ కొత్త సినిమా “ఫ్యామిలీ డ్రామా” ఈ నెల 29న సోని లివ్ లో
స్ట్రీమింగ్ కానుంది. మెహెర్ తేజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
“ఫ్యామిలీ డ్రామా” చిత్ర ట్రైలర్ ను ‘సోని లివ్’ రిలీజ్ చేసింది. ఆ
ట్రైలర్ ఎలా ఉందో చూస్తే..

బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆసక్తికరంగా సాగింది ఫ్యామిలీ డ్రామా
ట్రైలర్. ‘ఈత రానివాడు సముద్రాన్ని తిట్టుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుందో..
వినడం రానివాడు సంగీతం గురించి మాట్లాడినా అంతే అసహ్యంగా ఉంటుంది’ అని
సుహాస్‌ చెప్పిన డైలాగ్‌ మెప్పిస్తుంది. సుహాస్‌ హత్యలు చేసే
సన్నివేశాలు ఉత్కంఠ పెంచాయి. ప్రతి చిన్న విషయానికి తండ్రి బూతులు
తిడుతున్నాడనే కారణంగా ఇల్లు వదిలి వెళ్లిపోయిన ఓ అబ్బాయి, తన ఇంట్లో
పరిస్థితులు నచ్చక బయటకి వచ్చేసిన ఓ అమ్మాయి.. ఈ ఇద్దరూ ఎలా కలిశారు?
వీరికి సుహాస్ ఎలా సాయపడ్డాడు? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు
ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. టెక్నికల్ అంశాలతో పాటు ఆర్టిస్టుల
పర్మార్మెన్స్ లు ఇంటెన్స్ గా ఉన్నాయి.

ADVERTISEMENT

మ్యాంగో మాస్‌ మీడియా సమర్పణలో తేజా కాసరపుతో కలిసి మెహెర్‌ తేజ్‌ ఈ
చిత్రాన్ని నిర్మించారు. తేజ కాసరపు, పూజా కిరణ్‌, అనూష నూతుల, శ్రుతి
మెహర్‌, సంజయ్‌ రథా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి సంగీతం:
అజయ్‌, సంజయ్‌, ఛాయాగ్రహణం: వెంకట్‌ ఆర్‌. శాఖమూరి, దర్శకత్వం – మెహెర్
తేజ్.

ADVERTISEMENT
Latest Stories