
రిలీజ్ కి రెడీ అవ్వాల్సిన ఓ ప్యాన్ ఇండియా సినిమా, ఇప్పటికే ఆ సినిమా కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ఓ బడా నిర్మాణ సంస్థ. తాము రంగంలోకి దిగడానికి ముందు అనుకున్న బడ్జెట్ బాగా పెరిగినా.. కంటెంట్ మీద నమ్మకంతో ఎక్కడెక్కడినుండో సొమ్ములు తీసుకొచ్చి మరీ ప్రాజెక్ట్ మీద కుమ్మరిస్తున్నారు.
అయితే.. తాము అనుకున్న బడ్జెట్ కి ఓ 15% లేదా 30% ఎక్కువ అవ్వాలి కానీ.. మరీ 50% ఎక్కువ అవ్వడం ఏంటో అర్థం కాక, ఇప్పటివరకు అయిన ఖర్చు మొత్తాన్ని 3rd పార్టీ సంస్థతో ఆడిట్ చేయించారు సదరు నిర్మాణ సంస్థ యజయానులు. దాంతో నమ్మలేని అవినీతి భాగోతాలు బయటకొచ్చాయి.
ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లోనే చాలా వరకు అవకతవకలు జరుగుతున్నట్లు గుర్తించారు. అయితే.. ఆ టీమ్ మొత్తంలో ఎవరు ఎక్కువ దోచుకున్నారు అని ఆరా తీయగా.. ప్రొడక్షన్ డిజైనర్ పేరు బయటకొచ్చింది. స్పెషల్ సెట్స్, కార్పెంటర్ వర్క్, అసోసియేషన్ & యూనియన్ ఇలా అందరితోనూ కుమ్మక్కై.. నిర్మాతల నుండి ఏకంగా ఏడెనిమిది కోట్ల రూపాయల దాకా సైడ్ చేశారట.
ఒక ప్రొడక్షన్ డిజైనర్ ఇంత భారీ స్కామ్ చేయడాన్ని జీర్ణించుకోలేకపోయారు నిర్మాణ సంస్థ అధినేతలు. వెంటనే.. ఆ స్కాం చేసిన డబ్బు మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని, లేదంటే పోలీసులకి చీటింగ్ చేశారంటూ కంప్లైంట్ ఇస్తామనడంతో, వెంటనే ఆ ప్రొడక్షన్ డిజైనర్లు కాళ్ల బేరానికి దిగొచ్చారట.
ఓ రీజనల్ సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు సంపాదించుకున్న ఆ ప్రొడక్ధన్ డిజనర్లు.. ఈ ఒక్క సినిమాలోనే కాక తాము వర్క్ చేస్తున్న మిగతా ప్రొడక్షన్స్ లోనూ ఇదే స్థాయి స్కాం లు కాకపోతే కాస్త తక్కువ ఎమౌంట్స్ చేశారని తెలిసిందట. దాంతో.. ఆ నిర్మాతలందరూ కూడా వీళ్ల మీద ఫుల్ సీరియస్ అవ్వడంతో.. ఇప్పటివరకు దాచుకుని-దోచుకుని కొనుక్కున్న ఇల్లు, స్థలాలు, ఇన్వెస్ట్మెంట్లు అన్నీ అమ్మేసి సెటిల్ చేసే క్రమంలో ఉన్నారు.
ఈ స్కాంలు మరియు నిర్మాతలు ఫైర్ అవ్వడంతో.. చేస్తున్న ప్రాజెక్టుల నుండి తప్పుకోవడమే కాక, కొత్త ప్రాజెక్టులు రాకుండాపోయాయి. భవిష్యత్తులో వీళ్లకి అసలు చెప్పుకోదగ్గ సినిమాలు వస్తాయో లేదో కూడా తెలీదు. ఎంతో లాంగ్ కెరీర్ ఉన్న ఈ ప్రొడక్షన్ డిజైనర్లు ఇలా కక్కుర్తిపడి.. భవిష్యత్ లేకుండా చేసుకోవడం అనేది బాధాకరం.
టాలీవుడ్ ఇండస్ట్రీకి కార్పొరేట్ ప్రొడక్షన్ ప్రాసెస్ ను అడాప్ట్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఇలాంటి స్కాంలు ఎప్పటికప్పుడు గుర్తుచేస్తున్నా.. బ్లాక్ మనీ రొటేషన్ కి కుదరదని ఆ పద్ధతిని ప్రవేశపెట్టలేక, ఇలాంటి స్కామ్ ల బారినపడి పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు నిర్మాతలు.
Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…
BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…