గోపీచంద్ 2002 లో తేజ దర్శకత్వంలో జయం సినిమాలో విలన్ గా పరిచయం అయ్యాడు. ఆ తరువాతి ఏడాది వచ్చిన నిజం లో కూడా విలన్ గా చేశాడు. 2004లో మళ్ళీ హీరోగా చెయ్యడం మొదలు పెట్టాడు. అప్పటి నుండి ఇప్పటి దాకా వరుసగా సినిమాలో చేస్తున్నా ఎప్పుడో గానీ హిట్ రావడం జరగలేదు. ఇప్పుడు గోపీచంద్ మళ్ళీ విలన్ గా మారనున్నట్టు సమాచారం.
రజనీకాంత్ హీరోగా డైరెక్టర్ శివ దర్శకత్వంలో రూపొందుతున్న అన్నతె సినిమాలో గోపీచంద్ ని ఒక నెగటివ్ పాత్ర కోసం సంప్రదించారట. తొందరలో పూణే లో జరిగబోయే సరికొత్త షెడ్యూల్ లో గోపీచంద్ ఎంటర్ కాబోతున్నాడని అంటున్నారు. గోపీచంద్ హీరోగా శివ దర్శకత్వంలో శౌర్యం, శంఖం సినిమాలు తెరకెక్కాయి.
ఆ పరిచయంతోనే గోపీచంద్‌ను ఓ కీలకపాత్ర కోసం శివ సంప్రదించాడట. రజినీ సినిమాలో నటించేందుకు గోపీచంద్ కూడా ఓకే చెప్పేసినట్టు సమాచారం. గోపీచంద్ కి ఇది పెద్ద అవకాశం అని చెప్పుకోవాలి. రజినీకాంత్ సినిమాలో క్లిక్ అయితే అటు టాలీవుడ్, ఇటు కోలీవుడ్ లోనూ గోపికి మంచి ఆఫర్స్ రావడం ఖాయం.
మరోవైపు గోపి హీరోగా సీటీమార్ అనే సినిమా రాబోతుంది. ఇందులో గోపి కబడ్డీ కోచ్ గా కనిపించబోతున్నారట. ఈ చిత్రం మే నెలలో వేసవి కానుకగా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. వరుస పరాజయాలతో సతమతం అవుతున్న గోపి ఈ సరైన హిట్ సాదిస్తాడేమో చూడాలి
Gautam Gambhir and the Indian team management faced questions after their decision to send Tilak…
Prabhas might be one of the biggest superstars in Indian cinema, but there have been…