
ఇప్పుడు వైసీపీలో కూడా ఓ విభీషణుడు ఉన్నాడు. ఎవరా… ఇంకెవరు… నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజే! ఆయన విభీషణుడు అయితే జగనన్న ఎవరు?అని మాత్రం అడక్కండి. ఎవరికి వారు సమాధానం వెతుక్కోవలసిందే.
వైసీపీలో రఘురాముడే విభీషణుడు పాత్ర పోషిస్తున్నారు కానీ ఈ కధలో శ్రీరాముడు లేకపోవడమే పెద్దలోటు. నిత్యం జైశ్రీరామ్ అనే ప్రధాని నరేంద్రమోడీని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాని, బిజెపి నేతలని నమ్ముకొన్నప్పటికీ విభీషణుడుగారు అరికాళ్లు వాచిపోయేలా దెబ్బలు తినక తప్పలేదు. కానీ తనను ఆదుకొనే శ్రీరాముడు లేడని, ఏపీలో అడుగుపెడితే మళ్ళీ అరికాళ్ళు వాచిపోతాయని భయపడి విభీషణుడు వెనక్కు తగ్గడం లేదు. సేఫ్ ప్లేస్ ఢిల్లీలో కూర్చొని ఆంద్రాధీశుడితో చెడుగుడు ఆడుతూనే ఉన్నారు.
ఇవాళ్ళ జగనన్న లంకగుట్టును మన విభీషణుడు గారు లోక్సభలో బయటపెట్టేశారు. ఏపీ ప్రభుత్వం కార్పొరేషన్లను అడ్డుపెట్టుకొని ఇష్టంవచ్చినట్లు అప్పులు చేస్తూ వాటిని పక్కదారి పట్టిస్తోందని, ఇటీవల ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ పేరు చెప్పి అప్పులు చేయడమే ఇందుకు తాజా ఉదాహరణ అని గణాంకాలతో సహా వివరించారు.
అప్పుడు సభలో ఉన్న వైసీపీ ఎంపీలు ఆయన తమ ప్రభుత్వం గుట్టు బయటపెట్టకుండా అడ్డుకొనేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కానీ ఆలోగా మన విభీషణుడుగారు చాటింపు వేసినట్లు లంక గుట్టు బయటపెట్టేసారు.
అయితే శ్రీరాముడుని బిజెపిని వాడుకొంటున్నా బిజెపిలో శ్రీరాముడు ఎవరూ లేరు. కనుక లోక్సభలో ఆయన వాదన అరణ్యరోదనే అయ్యింది. కానీ కర్ర విరక్కుండా పాము చావకుండా అన్నట్లు అప్పులు చేయడం ఎలా?అనే సరికొత్త విషయం మిగిలిన రాష్ట్రాల వాళ్ళకు కూడా తెలిసిపోయింది. కనుక ఇప్పుడు వాళ్ళు ఆవిదంగానే ప్రొసీద్ అయిపోవచ్చు. ఆవిదంగానైనా మన రాష్ట్రం మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిపినందుకు ప్రజలు జగనన్నకు, ఆయన మన విభీషణుడుగారికి కృతజ్ఞతలు తెలుపుకోవలసిందే.
Chatrapathi is set to re-release in a 4K version this year on the occasion of…
Following the terrible failure of Retro, director Karthik Subbaraj made a comeback with his indie…