Telugu

100 రూపాయల నోటు ఏం పాపం చేసింది!

ఇప్పటివరకు హల్చల్ చేసిన పుకార్లన్నీ ఒక్కొక్కటిగా కార్యరూపం సిద్ధించుకుంటున్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత బంగారంపై ఆంక్షలు ఉంటాయంటూ హల్చల్ చేసిన వార్తల్లో నిజం లేదని కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పిన కొన్ని రోజులకే, అదే అరుణ్ జైట్లీ స్వయంగా తన నోటితో తానే బంగారంపై ఓ ప్రకటన చేసి, గతంలో హల్చల్ చేసినవి పుకార్లు కాదన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు. అయితే ఇదే సమయంలో దేశంలో కరెన్సీ మొత్తం మారిపోనుందని, ప్రస్తుతం ఉన్న 100, 50, 20, 10 రూపాయల నోట్లు కూడా పూర్తిగా మారిపోనున్నాయని దీనిపైన కూడా కేంద్రం ఓ సంచలన నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని తెలిసి వచ్చింది.

అయితే దీనిని కూడా కేంద్రం ఖండించి, ప్రజలు ఇలాంటి వదంతులను నమ్మవద్దని తెలిపింది. మరి నేడు ఆ ప్రకటన రానే వచ్చింది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా 20, 50 రూపాయల కొత్త నోట్లను ముద్రిస్తున్నామని చేసిన ప్రకటన ప్రజల్లో ఎలాంటి స్పందన లేదు. దీనికి రెండు కారణాలు… ఇప్పటికే ఈ సమాచారం లీక్ కావడంతో మానసికంగా ఫిక్స్ అయ్యి ఉన్నారు. మరొకటి… ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్లకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, పాత వాటిని కొనసాగిస్తూనే కొత్త నోట్లను అందుబాటులోకి తెస్తామని చెప్పింది. అయితే ప్రస్తుతానికి పాత నోట్లను ఉంచినా, భవిష్యత్తులో వీటిపై ప్రకటన రానుందన్న సంకేతాలు అయితే స్పష్టం.

ADVERTISEMENT

ఇక మిగిలింది ఒక్క 100 రూపాయల నోటే. ఈ వంద రూపాయల నోటు ఏం పాపం చేసిందో గానీ, దీనిపై మాత్రం రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే త్వరలో 100 రూపాయల నోటు కూడా సరికొత్తది రాబోతుందన్న విషయం ఇప్పటికే లీక్ కావడంతో… మరికొన్నాళ్ళ తర్వాతైనా ఆర్బీఐ నుండో, కేంద్రం నుండి వందపై కూడా ప్రకటన వస్తుందని సమాచారం. అయితే, ఈ చిన్న నోట్ల ముద్రణ వెనుకల కూడా పెద్ద స్కెచ్ ఉందని ఆర్ధిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

ప్రస్తుతం ముద్రణ జరుగుతున్న 500 రూపాయలను ఆపివేసి మరీ ఈ చిన్న నోట్లను ముద్రించాల్సిన ఆవశ్యకత ఏం వచ్చిందో ప్రజలకు అర్ధం కాని పరిస్థితి. దేశంలో చిల్లర కొరతకు కారణం 2000 రూపాయల నోటు అన్నది స్పష్టం. అలాంటి 2 వేలకు చిల్లర కావాలంటే 500 రూపాయల నోటే ప్రత్యామ్నాయం. మరి వాటిని ఆపి, ఇంకా చిన్న నోట్లను ముద్రించడం అంటే… దేశంలోని కరెన్సీని ఇంకా తగ్గించడమే కదా… అన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తపరుస్తున్నారు. తద్వారా ప్రజలకు నగదును అందుబాటులో లేకుండా చేసి ‘క్యాష్ లెస్’ లావాదేవీలను ప్రోత్సహించాలన్నది కేంద్రం అభిప్రాయంగా తెలియవస్తోంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

KTR Following Jagan’s Track Before Election?

The former chief minister of Andhra Pradesh YS Jagan appears to have collectively decided that…

39 minutes ago

ఓ కాళేశ్వరం… ఓ పోలవరం!

గోదావరి జిల్లాలలో ‘పోలవరం పూర్తికాదు.. ఈ పిల్లకి పెళ్ళి కాదు’ అనే నానుడి వినిపిస్తుంటుంది. నాలుగు దశాబ్దాల పాటు నిర్మాణం…

45 minutes ago