
ఆ తరువాత ఆ నిర్ణయాన్ని మార్చుకుని, జనవరి 25న విడుదల చేయనున్నామని ప్రకటించారు. అభిమానులంతా ఆ రోజు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుండగా, ఆ రోజున కూడా ఈ సినిమా థియేటర్లకు వచ్చే అవకాశం లేదనే టాక్ వినిపిస్తోంది. తమిళ సంవత్సరాది సందర్భంగా ఏప్రిల్ 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ ను బట్టి తమ సినిమాల విడుదలను ప్లాన్ చేసుకోవాలనుకున్న నిర్మాతలు, తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారట. తమని అయోమయానికి గురిచేయకుండా అసలు తేదీని ఎనౌన్స్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారనేది కోలీవుడ్ టాక్.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…