
[m9ad]
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా నైజామ్ విషయంలో మాత్రం నిర్మాత దిల్ రాజు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అని తెలుస్తుంది. ఎందుకంటే రాన్నున్నవి క్రిస్మస్, సంక్రాంతి పెద్ద పండగలు కానుండడంతో పెద్ద పంగడ అయిన సంక్రాంతి వరకూ బడా సినిమాలు ఏమీ లేకపోవడంతో అప్పటివరకూ సినిమా రన్ కి పెద్ద డోకా ఏమీ ఉండదు అని దిల్ రాజు భావిస్తున్నట్లుగా టాక్ బలంగా వినిపిస్తుంది. ఇక ప్రస్తుతానికి సినిమా వసూళ్లు కాస్త తగ్గినప్పటికీ అదంతా ఎలెక్షన్స్ వల్లనే అన్న మాట కూడా నిజమే అని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఈ సినిమా వసూళ్లు సంక్రాంతికి 30 కోట్లకు పైగానే వచ్చి, డబ్బింగ్ సినిమా చరిత్రలోనే ఈ సినిమా సరికొత్త రికార్డును సొంతం చేసుకుంటుంది అని దిల్ రాజు పూర్తి కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక రజని రోబో తొలి భాగం నైజామ్ ఏరియాలో దాదాపుగా 15 కోట్ల వసూళ్లు సాధించడం విశేషం.
మొత్తంగా చూసుకుంటే రజని మార్క్ ఉండడం, ఇక గ్రాఫిక్స్ మాయాజాలం అన్నీ వెరసి ఈ సినిమా నైజామ్ లో దుమ్ము దులిపేస్తుంది అని స్పాష్టంగా చెప్పవచ్చు. మరి దిల్ రాజు ఆశ, ఆలోచన ఎంతవరకూ కరెక్ట్ అవుతుందో తెలియాలి అంటే మాత్రం మనం సంక్రాంతి వరకూ ఆగాల్సిందే.
ఇప్పటికే జగన్ అక్రమాస్తులు, వివేక హత్య కేసులలో ఈడీ విచారణ జోరు పెంచింది. తాజాగా నాడు సమైక్య రాష్ట్రంలో పరిశ్రమలు,…
ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు రాష్ట్రాన్ని పాలించిన జగన్మోహన్ రెడ్డి నేడు పులివెందులలో పార్టీ శ్రేణులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం చాలా బాధాకరం.…