
పాత 500, 1000 నోట్లలో ఏ ఫీచర్స్ ఉన్నాయో… ఇందులో కూడా అవే ఉన్నాయని చెప్పారు. హై సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టాలంటే చాలా కసరత్తు చేయాల్సి ఉంటుందని… కనీసం ఐదు నుంచి ఆరు సంవత్సరాల సమయం పడుతుందని ఆయన తెలిపారు. ఇలాంటి ఎక్సర్ సైజ్ 2005లో చేపట్టారని… సెక్యూరిటీ థ్రెడ్, ఫైబర్, గుప్త చిత్రం, వాటర్ మార్క్ లాంటి భద్రతా ఏర్పాట్లు చేయాలంటే అనేక అనుమతులు అవసరమని, కేబినెట్ ఆమోదం కూడా అవసరమని చెప్పారు.
కొత్త నోట్లను ముద్రించాలనే నిర్ణయం ఆరు నెలల క్రితమే తీసుకున్నారని… అయితే సమయం చాలకపోవడంతో డిజైన్ మార్చినప్పటికీ, సెక్యూరిటీ ఫీచర్చ్ ను మాత్రం పాత నోట్ల మాదిరిగానే ఉంచినట్టు సదరు అధికారి చెప్పారు. నకిలీ నోట్లను అరికట్టడం కూడా అసాధ్యమని స్పష్టం చేశారు. పాకిస్థాన్ గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ లోనే నకిలీ నోట్లు ముద్రితమవుతున్నాయని చెప్పారు.
ఈ తాజా వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ఈ నోటుపై విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఈ 2 వేల నోట్లను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందంటూ సామాజిక మాధ్యమాలలో వదంతుల ప్రచారం ఊపందుకుంది. దీంతో ప్రజలు కంగారు పడిపోతున్నారు. ఈ నోటు వెనుక భాగంలో రెండు వేల రూపాయలు అనే అర్థం వచ్చేలా మొత్తం 15 భారతీయ భాషల్లో ముద్రించారు.
అయితే, ‘దోన్ హజార్ రూపయా’, ‘దోన్ హజార్ రుపయే’ అని రెండు రకాలుగా వుంది. అలా, అక్షర దోషాలతో ఈ నోట్లను ముద్రించారని, ఈ నోట్లను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందనేది ఈ ప్రచారంలో ఉన్న ఒక భాగం. కాగా, ‘దోన్ హజార్ రూపయా’, ‘దోన్ హజార్ రుపయే’ అనే వాటిలో ఒకటి మరాఠి భాష కాగా, మరోటి కొంకణి భాష అయి ఉండవచ్చని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు.
Kalvakuntla Kavitha had an emotional exit from the BRS party as she was sent out…
Varun Dhawan’s films have not worked big at the box office over the last few…