
తొలుత ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు రంగంలోకి దిగాయి. అందరూ ఊహిస్తున్నట్టుగానే స్టోక్స్ కు బిడ్ 5 కోట్లను దాటింది. ఆపై ఢిల్లీ డేర్ డెవిల్స్ రంగంలోకి దిగగా, స్టోక్స్ ధర 8 కోట్లకు, కింగ్స్ లెవన్ పంజాబ్ పోటీకి రావడంతో ఏకంగా 10 కోట్లకు పెరిగింది. ఆ సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏకంగా 13.5 కోట్లను ఆఫర్ చేసింది. స్టోక్స్ ను వదులుకోరాదని భావిస్తున్న పుణె సూపర్ జెయింట్స్, అతని ధరను మరో కోటి పెంచి 14.5 కోట్లకు సొంతం చేసుకుంది. స్టోక్స్ ను కొనుగోలు చేసిన తరువాత పుణె ఫ్రాంచైజీ వద్ద ఇక మిగిలింది 3 కోట్లు మాత్రమే కావడం గమనార్హం.
అలా 2 కోట్లు బేస్ వాల్యూ ఉన్న బెన్ స్టోక్స్ ను ఏకంగా 14.5 కోట్లు పెట్టి పూణే కొనుగోలు చేయడంలో అన్ని ఫ్రాంచైజ్ లు సహకరించాయి. ఇక, ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 2 కోట్లకు కింగ్స్ లెవన్ పంజాబ్ సొంతం చేసుకోగా, ఆల్ రౌండర్ పవన్ నేగిని 1 కోటి రూపాయలతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. మ్యాథ్యూస్ ను 2 కోట్లకు ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు, న్యూజిలాండ్ ఆల్ రౌండర్ ఆండర్సన్ ను ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు 1 కోటితో దక్కించుకుంది. మిచెల్ జాన్సన్ ను ముంబై 2 కోట్లకు, పాట్ కమ్మిన్స్ ను ఢిల్లీ 4.5 కోట్లకు, మిల్స్ ను 12 కోట్లకు బెంగుళూరు, బౌల్ట్ ను కోల్ కతా 5 కోట్లకు, రబడను ఢిల్లీ 5 కోట్లకు దక్కించుకున్నాయి.
మంచి ధర పలుకుతారని భావించిన ఇర్ఫాన్ పఠాన్ తో పాటు కివీస్ ఆటగాళ్లు గుప్తిల్, జాసన్ రాయ్, ఫయాజ్ ఫజల్, సీన్ అబాట్, రాస్ టేలర్లను కొనేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తిని చూపలేదు. మొత్తం మీద ఈ సీజనులో విదేశీ ఆటగాళ్లను తమ టీముల్లోకి చేర్చేందుకు ఫ్రాంచైజీలు పెద్దగా ఇష్టపడటం లేదని తెలుస్తోంది. తక్కువ ధరకు లభించే దేశవాళీ కుర్రాళ్లపైనే టీము యజమానుల దృష్టి ఉన్నట్టు సమాచారం. కాగా, ఈ వేలం ప్రారంభం సమయానికి ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఢిల్లీ డేర్ డెవిల్స్ వద్ద అత్యధికంగా 23 కోట్లుండగా, ముంబై ఇండియన్స్ వద్ద అతి తక్కువగా 11.55 కోట్లు మాత్రమే ఉంది. బెంగళూరు వేదికగా ఈ వేలం కొనసాగుతోంది.
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…