
వీరితో పాటు విశ్వమోహన్ భట్, సాక్షీ మాలిక్, పుల్లెల గోపీచంద్, గాయనీమణి ఆశా పారేఖ్, నేపథ్య గాయకులు కైలాష్ ఖేర్, శంకర్ మహదేవన్, సోనూ నిగమ్, బాలీవుడ్ వెటరన్ నటుడు రిషి కపూర్, నటుడు మనోజ్ బాజ్ పేయి, నృత్య కళాకారిణి లక్ష్మీ విశ్వనాథన్, రంగస్థల నటుడు బసంతి బిస్త్, కథకళి నృత్యకారుడు సీకే నాయర్ లకూ పద్మభూషణ అవార్డులు లభించాయి.
ఇక రెండవ అత్యున్నత పౌరపురస్కారమైన పద్మవిభూషణ్ ను దక్కించుకున్న వారిలో… ఎన్సీపీ నేత శరద్ పవార్, బీజేపీ నేత మరళీ మనోహర్ జోషి, లెజండరీ సింగర్ కేజే ఏసుదాస్ లు ఉన్నారు. వీరితో పాటు దివంగత ముఫ్తీ మహమ్మద్ సయీద్, పీఏ సంగ్మా, సుందర్ లాల్ పత్వాలకు మరణానంతరం పద్మవిభూషణ్ లను కేంద్రం ప్రకటించింది. ఈ సంవత్సరం ‘భారతరత్న’ అవార్డును ఎవరికీ ప్రకటించలేదు.
‘పద్మశ్రీ’ల విషయానికి వస్తే క్రీడారంగంలో రాణిస్తున్న విరాట్ కోహ్లీ, దీపా మాలిక్, దీపా కర్మాకర్, వికాస్ గౌడ, పీఆర్ శ్రీజేష్ లకు అవార్డులు లభించాయి. ఎయిడ్స్ పై రీసెర్చ్ చేస్తున్న డాక్టర్ సునితీ సాలమన్, సినీ విమర్శకుడు భావనా సోమయ్య, గాయని అనురాధా పౌడ్వాల్ లకు పద్మశ్రీ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. మిగతా అవార్డుల వివరాలు తెలియాల్సి వుంది.
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…