Telugu

2019లో కేసీఆర్ ఉపప్రధాని అవ్వనున్నారా?

తెలంగాణా ముఖ్యమంత్రి వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని వెయ్యి కళ్ళతో వేచిచూస్తున్నారు. దీనికి కారణం ఒక జ్యోతిష్కుడు చెప్పిన మాట అంట. ఆయన చెప్పిన దాని ప్రకారం 2019లో బీజేపీకు కావాల్సిన మెజారిటీ రాదు, మళ్ళీ డిల్లీ పీఠం ఎక్కడానికి మోడికు టీఆర్ఎస్ అవసరం పడతాదట.

అప్పుడు ఉపప్రధాని పధవికి తక్కువ అడగకూడదని కేసీఆర్ వ్యూహం. ఆ జ్యోతిష్కుడు చెప్పిన దాని ప్రకారం కేసీఆర్ డిల్లీకి వెళ్తే ఆయన పుత్ర రత్నం కేటీఆర్ తెలంగాణాను పాలిస్తారట, కావున 2019 సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని వెయ్యి కళ్ళతో వేచిచూస్తున్నారు మన రావుగారు.

ADVERTISEMENT

మొన్న సింగరేణి ఎన్నికల జైత్రయాత్రలో కేసీఆర్ ఇదే రూట్లో ఒక మాట చెప్పారు కూడా. “మీరంతా అనుకుంటే కవిత 2019లో కేంద్ర భొగ్గు శాఖ మంత్రి కచ్చితంగా అవుతుంది,” అని కేసీఆర్ చెప్పారు. దీని బట్టి సీఎం కేసీఆర్ మనసులో మాట చెప్పకనే చెప్పినట్టు అయ్యింది.

టీఆర్ఎస్ ఎన్డీయేలో చేరుతుందనే ప్రచారం ఎప్పటి నుండో ఉంది ఐతే ఎన్నికల ముందు పొత్తు పెట్టుకుంటే ముస్లీం సోదరుల ఓట్లు పోతాయని కేసీఆర్ ఉద్దేశం. కావున 2019 ఎన్నికలకు ఒంటరిగా వెళ్ళి ఎన్నికల తరువాత పొత్తు పెట్టుకుంటే మంచిదని ఆయన ఉద్దేశం. దీని ప్రకారమే ఆయన పావులు కదుపుతున్నారు.

గతంలో కేసీఆర్ యూపీయే తరపున కేంద్ర మంత్రిగా పనిచేశారు. తరువాతి కాలంలో తెలంగాణా కోసం రాజీనామా చేసి యూపీయే నుండి బయటకి వచ్చారు. 2009 ఎన్నికల్లో థర్డ్ ఫ్రంట్ నుండి పోటీ చేసి ఎన్నికల ఫలితాలు రాకముందే ఎన్డీయే సభలో పాల్గొన్నారు. ఐతే ఆ ఎన్నికల్లు టీఆరఎస్కు ఎన్డీయే కు సానుకూల ఫలితాలు రాలేదు. 2014లో విడిగా పోటీచేసి తెలంగాణాలో తిరుగులేని నాయకుడుగా అయ్యారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Indians’ Reels in U.S. Stores: Where Is the Civic Sense?

A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…

7 hours ago

The Paradise Has Hype, But Is It Enough?

Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…

7 hours ago