
గత రెండు వారాలుగా ఒక అభ్యర్థిని నిలబెట్టడానికి విస్తృతంగా ప్రయత్నించిన ఆ పార్టీ చివరికి అందుకు ఎవరు సిద్ధంగా లేకపోవడంతో ఆఖరి నిముషంలో పోటీ నుండి విరమించుకుంది. దీనికి వారు చెప్పిన కారణం ఏదైతే ఉందో చాల హాస్యాస్పదంగా ఉంది. వైకాపా చెప్తునట్టుగా టీడీపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందనే అనుకుందాం.
2019 ఎన్నికలలో కూడా అలా చేసే ప్రయత్నం చేస్తది ఆ పార్టీ. మరి అప్పుడు కూడా జగన్ పోటీకి దూరంగా ఉంటారా? ప్రజాస్వామ్య విలువలను కాపాడటంతోపాటు అవినీతికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో రాజకీయ సన్యాసం చేస్తారా? అవినీతి రాజకీయాల గురించి వామపక్షాలు సైతం మాట్లాడలేని రోజులివి.
జగన్ మాట్లాడితే జనాలు హర్షిస్తారా? ఇప్పటికే ఇలాంటి వింత కారణంతో అసెంబ్లీ ని బహిష్కరించి అభాసుపాలు అయ్యారు. కష్టమో నష్టమో ఏదో రకంగా పోటీ చెయ్యాలిగానీ ఇలా ప్రధాన ప్రతిపక్షమే అభ్యర్థిని నిలబెట్టలేకపోతే, అది ఎన్నికలకు ఏడాదిన్నర కూడా లేదు ఈ సమయంలో ఇలాంటి నిర్ణయాలు ఆత్మహత్య సదృశ్యాలు అనే చెప్పుకోవాలి.
Telangana is planning a massive new cricket stadium in Bharat Future City near Hyderabad. The…
Art director and TTD Board Member Anand Sai’s son Sandeep has been arrested by Cyberabad…