Telugu

థర్డ్ టెస్ట్ ఫస్ట్ డే – ఆసీస్ కొట్టేసింది!

ప్రతిష్టాత్మకంగా మారిన ఇండియా – ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ లో మూడవ టెస్ట్ మ్యాచ్ లో తొలిరోజు ఆస్ట్రేలియా ఆధిపత్యం ప్రదర్శించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా తొలి 10 ఓవర్లలోనే 50 పరుగులు చేసి మంచి దూకుడు మీదున్న సమయంలో… జడేజా వేసిన ఓ ఫుల్ టాస్ బాల్ షాట్ కొట్టిన వార్నర్, కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు. దీంతో కాస్త ఉపశమించిన టీమిండియా బౌలర్లకు ఆ తర్వాత రైన్ షా 44, మార్ష్ 2 పరుగులకు వెనువెంటనే అవుట్ కావడంతో తొలి సెషన్ లోనే 3 వికెట్లు తీసి భళా అనిపించుకున్నారు టీమిండియా బౌలర్లు.

అయితే రెండవ సెషన్ లో మాత్రం కేవలం హ్యాండ్ కాంబ్ 19 వికెట్ ను మాత్రమే పడగొట్టిన టీమిండియా, మూడవ సెషన్ లో ఏకంగా చేతులెత్తేసింది. దీంతో తొలి రోజున 4 వికెట్లు కోల్పోయి 299 పరుగుల భారీ స్కోర్ ను ఆసీస్ నమోదు చేయగలిగింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ మరోసారి ఇండియన్ పై తన టాలెంట్ ఏంటో నిరూపించుకుని, సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సిరీస్ లో ఒక్క ఇండియన్ బ్యాట్స్ మెన్ కూడా సెంచరీ చేయకపోగా, స్మిత్ మాత్రం రెండవ సెంచరీని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాడు.

ADVERTISEMENT

అలాగే 6వ స్థానంలో బరిలోకి దిగిన మాక్స్ వెల్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన మాక్స్ వెల్ 82 పరుగులతో సత్తా చాటాడు. ఇందులో రెండు భారీ సిక్సర్లు కూడా ఉన్నాయి. టీమిండియా బౌలర్లలో ఉమేష్ యాదవ్ 2 వికెట్లు సొంతం చేసుకోగా, అశ్విన్, జడేజా చెరో వికెట్ తో సరిపెట్టుకున్నారు. రెండవ రోజు ఆసీస్ బ్యాట్స్ మెన్ ను కట్టడి చేయలేకపోతే, ఈ టెస్ట్ లో టీమిండియాకు కష్టాలు తప్పకపోవచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Tough Battle Starts Now, But Revanth Is Ready?

The Congress leadership took the tough call of firing Konda Surekha from her Cabinet position…

26 minutes ago

Prabhas’ Kalki 2: Who Is Behind the Fake Casting Scam?

Vyjayanthi Movies, the producers of Kalki 2898 AD, have issued an official warning about fake…

56 minutes ago