
శంకరమఠం ప్రాంతానికి చెందిన హైకోర్టు న్యాయవాది సాయికృష్ణ ఆజాద్, గురువారం నాడు ఏటీఎం నుంచి డ్రా చేసిన 500 నోటును (నంబర్ 5 ఏసీ 377217) బయటకు తెస్తుండగా, చేతిలోంచి జారి నీళ్లలో పడిపోయింది. వెంటనే ఆ నోటును బయటకు తీసి, ఫ్యాన్ గాలికి ఆరబెట్టగా, ఇదిగో ఈ ఫోటోలో చూపిస్తున్నట్లుగా మారిపోయింది. రంగు వెలిసి ఆనవాళ్లు కోల్పోవడంతో పాటు, జాతిపిత గాంధీ బొమ్మతో, ఇతర అక్షరాలు సైతం పాడైపోయాయి.
దీంతో ఇంతకీ అది అసలు నోటా? లేక నకిలీదా? అని ఆజాద్ విస్తుపోయారు. పాడైపోయిన 500 రూపాయల నోటు చిత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో 2 వేలను పరీక్షించినట్టు 500ను పరిశీలించరాదన్న నీతి ఈ ఘటనతో తెలుస్తోందని, 500 నోట్లతో నీటి ప్రయోగాలు వద్దని, చేస్తే నోటు చెల్లకుండా పోతుందని సోషల్ మీడియా సలహా ఇస్తున్నారు.
బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ వేటుతో బయటకొచ్చిన కవిత తెలంగాణ రక్షణ సేన పేరుతో కొత్త రాజకీయం మొదలుపెట్టిన సంగతి…
KVN Productions has quickly established itself as one of the ambitious production houses in South…