
బహుశా ఇదే కోవలో తాజాగా విడుదలైన “9” సినిమా టీజర్ ఉన్నట్లు కనపడుతోంది. అక్కాచెల్లెళ్ళ థ్రిల్లర్ ఎపిసోడ్స్ తో ఇప్పటికే ‘చారుశీల’ వంటి చాలా సినిమాలు వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. అలాగే హార్రర్ మూవీస్ అంటే ఊరి చివరన ఉండే బూత్ బంగ్లా కామన్. సరిగ్గా ఇదే కాన్సెప్ట్స్ తో “9” మూవీ తెరకెక్కినట్లుగా కనపడుతోంది. అయినప్పటికీ టీజర్ చూడగానే ఫ్రెష్ ఫీలింగ్ ను కలిగించడంలో సక్సెస్ అయ్యింది.
సునీల్ కుమార్ అందించిన మంచి ఫోటోగ్రఫీ, పాకాల శ్రీచరణ్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ సంగీతంతో కూడిన “9” టీజర్, పాత సీసా కొత్త నీరులా కనపడుతున్నా… ప్రేక్షకులలో మాత్రం కావల్సినంత ఆసక్తిని నింపింది. అర్చన, పావనిలు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాలో అతుల్ కులకర్ణి, కబీర్ దుహన్ సింగ్ లు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. “9” అంకె చుట్టూ తిరిగే ఈ సినిమాకు అశ్విని కుమార్ దర్శకత్వం వహించారు.
Nimrit Kaur is redefining raw ethnic elegance with an earthy, unapologetically sultry photoshoot that is…
BOTTOM LINE Thin Story, Patchy Laughs RATING 2/5 Story, Screenplay, Director: Venu Gopal Reddy Cast:…