
కంటెంట్ ఉన్న కధలా కనపడుతున్న ‘అ…ఆ…’ ట్రైలర్లో నితిన్ పాత్ర అనసూయ రామలింగం కంటే సమంత పాత్ర ఆనంద్ విహారి ఎక్కువగా ఉన్నట్లు కనపడుతోంది. ట్రైలర్లో కట్ చేసిన షాట్స్ లో మొత్తం కూడా సమంతనే డామినేట్ చేసింది. అలాగే కెరీర్ బెస్ట్ అభినయాన్ని ఈ సినిమాలో సమంత అందించినట్లుగా కనపడుతోంది. ఇక సాంకేతిక విభాగానికి వస్తే బ్యాక్ గ్రౌండ్ సంగీతం, ఫోటోగ్రఫీ, లొకేషన్స్, త్రివిక్రమ్ టేకింగ్ అన్నీ ప్రేక్షకులకు చూసే కొద్ది చూడముచ్చటగా ఉన్నాయి.
సినిమాపై ప్రస్తుతం ఉన్న అంచనాలను మాత్రం రెట్టింపు చేయడంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయిన ఈ ట్రైలర్లో ఏదో మిస్ అయ్యిందన్న అనుభూతితో పాటు, త్రివిక్రమ్ ఏదో చూపించబోతున్నారన్న ఫీల్ ను కలిగించారు. క్లాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేసిన ఈ సినిమా పక్కా హిట్ అందుకునే కళలు స్పష్టంగా కనపడుతున్నాయి.
The gap between film reviewers and audiences is nothing new in Telugu cinema. Nani's The…
Virat Kohli and Shubman Gill smashed centuries as India defeated West Indies by eight wickets…