
దీంతో ‘స్పైడర్’ సృష్టించిన గ్లిమ్స్ ను చిన్న సినిమాలు ఫాలో అయిపోతున్నాయి. అందులో భాగంగా తాజాగా “మెంటల్ మదిలో” చిత్ర యూనిట్ తమ గ్లిమ్స్ ను విడుదల చేసింది. అనగనగా ఓ రాజు నుండి ప్రారంభమైన ఈ గ్లిమ్స్ లో హీరో శ్రీవిష్ణు వాయిస్ ఓవర్ తో కూడిన డైలాగ్స్ వినపడుతుంటాయి. ఆ రాజు పరిస్థితే అలా ఉంటే, 1987 నుండి తన పేరు అరవింద్ కృష్ణలో కంఫ్యూజన్ నెలకొందని… అది మీరే డిసైడ్ చేసుకోండి… అంటూ హీరోయిన్ నివేతా పెతురాజ్ కౌగిలించుకునే సన్నివేశాన్ని చూపించారు.
ప్రశాంత్ సంగీతం ఆహ్లాదకరంగా ఉండగా, శ్రీవిష్ణు డైలాగ్ మాడ్యులేషన్ ఆకట్టుకునే విధంగా ఉంది. వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, రాజ్ కందుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గత కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో హీరోయిన్ నివేతా పెతురాజ్ పేరుతో న్యూడ్ వీడియో చక్కర్లు కొడుతుండడంతో, ఈ బ్యూటీ పేరు మరోసారి హాట్ హాట్ గా మారింది. బహుశా ఈ “మెంటల్ మదిలో” సినిమాకు ఈ బ్యూటీ హాట్ వీడియో పబ్లిసిటీలా ఉపయోగపడుతుందేమో చూడాలి.
Andhra Pradesh's urban local body elections saw a mixed voter response. While some municipalities recorded…
Ram Charan and Sukumar's RC17 has started attracting attention even before the film gets going.…