
ఆర్ఆర్ఆర్ సినిమా నిడివి ఇప్పటికే ౩గంటలు ఉండడంతో ఎడిటింగ్ లో కొని సన్నివేశాలను తగ్గించి సినిమాను థియేటర్లలో విడుదల చేశారు జక్కన్న. అయితే సినిమా ఓటిటిలో విడుదల చేసే సమయంలో ఆ డిలిటెడ్ సీన్స్ లో కొన్నింటిని సినిమాకు జత చేస్తారనే వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.
జక్కన్న తన ఆలోచనలను ఆచారంలో పెడితే థియేటర్లలో సినిమాను ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు కూడా మళ్లి ఓటిటి ప్లాట్ ఫామ్ మీద మూవీ చూడడానికి ఆసక్తి చూపుతారు. ఇలా అటు ధియేటర్ల లోను., ఇటు ఓటిటి ప్లాట్ ఫామ్ లోను రికార్డుల మోతకు రాజమౌళి రంగం సిద్ధం చేస్తున్నట్లున్నారు.
ఓటిటి వర్షన్ లో జూ.ఎన్టీఆర్ కు మల్లికి మధ్య సన్నివేశాలను.,రామ్ చరణ్ – ఆలియా మధ్య కొన్ని సన్నివేశాలను జత చేసి ‘న్యూ ఆర్ఆర్ఆర్’ ను ఓటిటి ప్రేక్షకులకు అందిస్తున్నారన్న సమాచారంతో మరో సారి మూవీని వీక్షించడానికి సిద్ధంగా ఉన్నారు సినిమా ప్రేమికులు. రాజమౌళి “నీ ఫాన్స్ వెయిటింగ్” ఇక్కడ అంటూ ఓటిటి ప్రేక్షకులు సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
BRS working president and former Telangana minister K.T. Rama Rao (KTR) has reportedly filed a…
Ask people who directed a hit film most of the people have an answer. Ask…