
ఏప్రిల్ 12వ తేదీ… సాయంత్రం 5 గంటలకు ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తున్నట్లుగా చిత్ర నిర్మాణ సంస్థ ఎన్వీఆర్ ప్రకటించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రిన్స్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వీడియోలకు, ఫోటోలు నెటిజన్లకు నవ్వు తెప్పిస్తున్నాయి. ఎన్వీఆర్ ప్రొడక్షన్ వాళ్ళను ప్రిన్స్ అభిమానులు హగ్ చేసుకున్నట్లుగా… అలాగే సంతోషకరమైన ఆనంద భాష్పాలు వస్తున్నట్లుగా… గంతులేస్తూ ఉన్నట్లుగా… ఇలా ఒకటేమిటి… తమకు గుర్తుకు వచ్చిన ప్రతి సందర్భాన్ని వాడేసుకుంటూ పండగ చేసుకుంటున్నారు.
ఇంతకీ ‘ఫస్ట్ లుక్’ ఏ టైటిల్ తో రాబోతోంది అని అనుకుంటున్నారా… ‘ఆ ఒక్కటి అడక్కు’ అంటోంది చిత్ర యూనిట్. ఎందుకంటే, టైటిల్ ప్రకటన కూడా ఫస్ట్ లుక్ తో పాటే ఉండనుంది. కానీ, అనధికారిక సమాచారం ప్రకారం, ఇప్పటికే “స్పైడర్” అన్న టైటిల్ ను ఖరారు చేసారని, తెలుగు, తమిళంలో కూడా ఇదే పేరుతో విడుదల కానుందని తెలుస్తోంది. ఏది ఏమైతేనేం… ఒక్క అభిమానులే కాదు, టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు కూడా ఈ ఫస్ట్ లుక్ పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ప్రిన్స్ – మురుగదాస్ ల కాంభినేషన్ ప్రభంజనం సృష్టించడం ఖాయమన్న టాక్ నేపధ్యంలో… ఫస్ట్ లుక్ ఎంతమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
మంత్రి కొండా సురేఖ భయపడినట్లే జరిగింది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఈరోజు ఉదయం ఆమెకు ఫోన్ వచ్చింది. ఈరోజు సాయంత్రం…
The chief minister of Telangana Revanth Reddy had been touring Delhi for the last few…