Telugu

అనిల్ సుంకర Vs అభిషేక్ నామా: అసలు ఇష్యూ భోళా శంకర్ తోనే!

ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ – నిర్మాత అభిషేక్ నామా … మరో నిర్మాత అనిల్ సుంకర మీద ఇండస్ట్రీ బాడీల ద్వారా ఫైట్ చెయ్యడానికి సిద్ధం అవుతున్నారు. 2018 లో విడుదలైన గూఢచారి సినిమాలో అభిషేక్ అగర్వాల్, అభిషేక్ నామా, పీపుల్స్ మీడియా, అనిల్ సుంకర పార్టనర్స్. ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్ అనిలే చేసారు. ఆ లెక్కలు ఇంకా చెప్పలేదని ఇప్పుడు భోళా శంకర్ రిలీజ్ టైం లో వివాదం ముదిరింది.

ఆ భాగస్వామ్యులే కలిసి ఇప్పుడు జి-2 (గూఢచారి 2) చేస్తున్నారు.

ADVERTISEMENT

అభిషేక్ నామా సినిమా ఫైనాన్షియర్ కూడా. సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు విజయ్ దేవరకొండ తో 2020 లో వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమా చేశారు. ఆ సినిమా నిమిత్తం కేఎస్ రామారావు అభిషేక్ నామాకి కొంత అమౌంట్ ఇవ్వాలి.

ఇదిగో అదిగో అంటూ కాలం గడుపుతూ వచ్చారు. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ అనిల్ సుంకర – కేఎస్ రామారావు పార్టనర్ షిప్ లో ప్రకటించారు. భోళా శంకర్ రిలీజ్ టైం లో డబ్బు సెటిల్ చేస్తా అని కేఎస్ రామారావు మాట ఇచ్చారట.

అయితే కొద్ది నెలలు గా భోళా శంకర్ పోస్టర్ల మీద కేఎస్ రామారావు పేరు తీసేసి ఆయనకు సినిమా తో సంబంధం లేదని చెబుతున్నారు అనిల్. దీనితో అభిషేక్ నామాకు రికవరీ ఛాన్స్ కి ఇబ్బంది వచ్చింది.

సహజంగా ఇండస్ట్రీ లో ఎలా ఉంటుంది అంటే… ఒక పార్టనర్ ఇబ్బందులలో ఉంటే ఆయనను పోస్టర్ల మీద నుండి తప్పించి తెర వెనుక లావాదేవీలు నడుపుతారు… ఆ ఇబ్బందుల్లో ఉన్న పార్టనర్ కు సంబంధించిన ఇబ్బందులు తమ సినిమాకు అంటుకోకుండా.

అయితే ఎప్పుడో 2018లో వచ్చిన గూఢచారి లెక్కలు తేల్చకపోయినా ఇబ్బంది పెట్టని తనకు కేఎస్ రామారావు ను పోస్టర్ల మీద నుండి తప్పించి తనకు మరింత నష్టం తీసుకురావడం అభిషేక్ నామా కు కోపం తెప్పించి ఉండొచ్చు.

అయితే ఈ సినిమాలో మరో పార్టనరైన అభిషేక్ అగర్వాల్ మాత్రం తనకు గూఢచారి ఇష్యూలో ఇబ్బంది లేదని అంటున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Reality: Devika Bhat’s First Look as Aalochana

Kiran Abbavaram, who has acted in several successful films, is making his directorial debut with…

8 minutes ago

Nagarjuna Surprised After Watching Itllu Arjuna

Nagarjuna has decided to present the film Itllu Arjuna under his Annapurna Studios banner after…

29 minutes ago