
అయితే దీనిపై ప్రముఖ నిర్మాత – డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా మాత్రం డిఫరెంట్ గా స్పందించారు. ట్విట్టర్ లో ఫ్యాన్స్ కు డబ్బులివ్వడం సంతోషం అలాగే మీ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కి గాను మేము 8 కోట్లు పోగొట్టుకున్నాం. మా ఎక్సిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కుటుంబాలను కూడా ఆదుకోండి అంటూ ఒక ట్వీట్ వేశారు.
ఈ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అసలు అభిషేక్ నామాకు విజయ్ దేవరకొండ కు గొడవ ఏంటి? అభిషేక్ నామా వరల్డ్ ఫేమస్ లవర్ పంపిణీ చేసి 8 కోట్లు పోగొట్టుకున్నది వాస్తవమే.
ఈ సినిమా నష్టాన్ని పూడ్చమని అడగను, మీ రెమ్యూనరేషన్ ఎంత ఉంటే అంత తీసుకుని మాకు ఒక సినిమా చేసి పెట్టండి. మంచి కథ తో సినిమా తీసి ఆ నష్టాన్ని ఆ సినిమాతో భర్తీ చేసుకుందాం అని నామా ప్రపోజల్ పెట్టారట.
అయితే దేవరకొండ సైడ్ నుండి తాము ప్రస్తుతం తెలుగు నిర్మాతలకు సినిమాలు చెయ్యట్లేదు కాబట్టి కష్టం అనే సమాధానం వచ్చిందట. ఇది లైగర్ సమయంలో.
కొంతమంది సినిమా లాస్ వస్తే నిర్మాతని అడగాలి గానీ హీరోని అడగడం ఏంటి అనే వాదన తెర మీదకు తెస్తున్నారు.
వరల్డ్ ఫేమస్ లవర్ నిర్మాత కేఎస్ రామారావు పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. “ప్రొడ్యూసర్ ని అడగాలి నిజమే కానీ మన దగ్గర ఒక సినిమా రైట్స్ కొనేది హీరోని చూసి, ఆయన్ని నమ్మే కదా? పైగా నష్టాన్ని భర్తీ చెయ్యమని నేను అడగట్లేదు. డేట్స్ ఇవ్వండి మీ రెమ్యూనరేషన్ మార్కెట్ బట్టే తీసుకోండి అంటున్నా. ఇందులో అభ్యంతరం ఏంటి?,” అని అంటున్నారు నామా.
ఇప్పటికే లైగర్ సమస్య ఇంకా ఒక కొలిక్కి రాలేదు.. ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ వివాదం కూడా తెరమీదకు వచ్చింది.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…