
ఆర్ఆర్ఆర్ కు ఇప్పటికే ఇద్దరు హీరోల టీజర్లు విడివిడిగా విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఇద్దరికీ ఒక జాయింట్ టీజర్ విడుదల చెయ్యాలని రాజమౌళి ఆలోచనగా ఉందంట. నాలుగు నెలల క్రితం ఆచార్య మోషన్ పోస్టర్ విడుదల చేసారు… టీజర్ విడుదల చేసి ప్రమోషన్స్ ముమ్మరం చెయ్యాలని చిరంజీవి ఆలోచనట.
అయితే వీటికి సంబందించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే రెండు టీజర్లు ఒకే సందర్భంగా విడుదల అవుతున్నా ఒకటి 26న, ఒకటి దానికంటే ఒకరోజు ముందు విడుదల కావొచ్చు. ఈరోజు రేపు యూట్యూబ్ వ్యూస్ రికార్డులు కూడా ఉంటాయి కదా?
ఆచార్య మే 7న విడుదల చెయ్యడానికి చిత్రబృందం ఆలోచన చేస్తుంది. అదే విధంగా ఆర్ఆర్ఆర్ దసరా కు వస్తుందని అంటున్నా ఆ సినిమా 2022 సంక్రాంతికి వెళ్లొచ్చు అని అంటున్నారు. ఈ రెండు సినిమాల విడుదల ప్రణాళిక ఏమైనా ఈ టీజర్లతో వెల్లడి చేస్తారా అనేది కూడా ఆసక్తికరమైన విషయం.
Ram Gopal Varma has announced his new film Police Company, which is scheduled to hit…
Vijay Deverakonda seems to be going through a disastrous and confusing phase in his career,…