Telugu

‘రెగ్యులర్’ కమర్షియల్ డ్రామా విత్ ‘మల్టీస్టారర్’

భారీ అంచనాలు పెట్టుకున్న “ఆచార్య” ధియేటిరికల్ ట్రైలర్ విడుదలైంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 29వ తేదీన విడుదల కాబోతోంది. మరి అంచనాలను ఈ ట్రైలర్ అందుకుందా? అంటే మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ లను ఒకే ఫ్రేమ్ లో చూడాలన్న మెగా ఫ్యాన్స్ ఆకాంక్ష నెరవేరే విధంగా ఉంది.

కధ పరంగా ట్రైలర్ ద్వారా చెప్పాలంటే… ప్రశాంతంగా ఉండే ధర్మస్థలిలో ఆపద రావడం, వాటి నుండి చిరంజీవి ఎలా కాపాడారు? అనేదే ప్రధాన థీమ్ గా కనపడుతోంది. అయితే ధర్మస్థలికి – చిరంజీవికి లింక్ ఉన్న రామ్ చరణ్ ఎపిసోడ్ ఏమిటి? ఫ్లాష్ బ్యాక్ లో చిరు – చరణ్ ల నక్సలైట్ మ్యాటర్ ఏంటి? అన్న ఆసక్తికర అంశాలతో ట్రైలర్ వదిలారు.

ADVERTISEMENT

సింపుల్ గా చెప్పాలంటే… విలనిజం పీక్స్ తీసుకెళ్లి, హీరోతో యాక్షన్ సన్నివేశాలను నింపే బోయపాటి మార్క్ డైరెక్షన్ ఎక్కువగా కనపడింది. సహజత్వానికి దగ్గరగా ఉండే కొరటాల శివ మార్క్ డైలాగ్స్ ట్రైలర్ లో మచ్చుకైనా కనపడకపోవడం ఆశించిన విషయం కాదు. బహుశా అన్ని ధియేటర్ లో వినిపించడానికి దాచిపెట్టేసారో ఏమో గానీ, ఒక్క పవర్ ఫుల్ డైలాగ్ కూడా ట్రైలర్ లో పెట్టలేదు.

మరో విశేషం ఏమిటంటే… “ఆచార్య” సినిమాలో అసలు హీరో చిరంజీవి కాగా, ఓ కీలక పాత్రను రామ్ చరణ్ పోషించారు. కానీ ట్రైలర్ చూస్తుంటే అసలు హీరో రామ్ చరణ్ లా కనపడుతున్నాడు. బహుశా “ఆర్ఆర్ఆర్” ప్రభావమో ఏమో గానీ, చరణ్ నటప్రస్థానం ఇప్పుడే మొదలయ్యినట్లుంది. చిరు – చరణ్ లు కలిసి నర్తించిన పాటలోని ఓ స్టెప్ ను మచ్చుకు చూపించారు.

మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, తిరు ఫొటోగ్రఫీ బాగున్నాయి. ఇక హీరోయిన్లు నటించిన పూజా హెగ్డే, కాజల్ లలో పూజా అలా తళుక్కుమనగా, కాజల్ ను అసలు ట్రైలర్ లో లేకుండా చేసేసారు. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు ఈ ట్రైలర్ ద్వారా భారీ హైప్ అయితే రాకపోవచ్చు గానీ, మెగా ఫ్యాన్స్ కు కావాల్సిన “మల్టీస్టారర్” స్టఫ్ అయితే పుష్కలంగా ఉంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by
Tags: Acharya

Recent Posts

Endgame Returns, Takes Down Baahubali Record

Seven years later, Avengers: Endgame has returned to Indian theatres and picked a rather interesting…

24 minutes ago

Jailer 2 Has the Brand, But Where Is the Frenzy?

Jailer 2 has all the ammunition for a frenzy, but the trigger hasn't been pulled…

54 minutes ago