
మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న “స్పైడర్” సినిమా జూన్ 23వ తేదీన విడుదల చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు పోటీగా బన్నీ “దువ్వాడ జగన్నాధమ్”ను కూడా రంగంలోకి దించుతున్నారని ఇటీవల ఓ టాక్ సందడి చేసింది. ముందుగా జూన్ 23 అన్నప్పటికీ, తాజాగా జూలై 7వ తేదీకి ఈ సినిమా డేట్ ను మార్చినట్లుగా తెలుస్తోంది. బన్నీ వెనక్కి తగ్గాడు గానీ, మహేష్ సినిమా విడుదల తేదీకి నాని ఎంట్రీ ఇచ్చి కొత్త ట్విస్ట్ ఇచ్చాడు.
ఇందులో మరో విశేషం ఏమిటంటే… కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న “భరత్ అనే నేను” సినిమాను దానయ్య నిర్మించనున్నాడు. మరి ప్రిన్స్ తో సినిమా తీస్తూ… ప్రిన్స్ సినిమాకే పోటీగా తన తాజా చిత్రాన్ని విడుదల చేస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. మహేష్ రేంజ్ నానికి లేకపోయినప్పటికీ, ప్రస్తుతం నాని సినిమా అంటే పడిచచ్చే సినీ ప్రేక్షకులకు, నాని అభిమానులకు కొదవలేదని చెప్పవచ్చు. మరోవైపు “స్పైడర్” వంటి ప్రతిష్టాత్మక సినిమాతో తలపడడం నానికి కూడా కాస్త డేంజరే అని చెప్పకతప్పదు.
As we have already informed our readers, for the first time in Bigg Boss Telugu…
The municipal elections in Andhra Pradesh ended on November 1, but the political battle did…