
నాని గ్యాంగ్ లీడర్ చిత్రం విడుదలకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే నెల 13న చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అదే రోజు విడుదల కాబోతున్న వరుణ్ తేజ్ వాల్మీకి తో పోటీ పడబోతోంది. దానితో ఇరు సినిమాల ఓపెనింగ్స్ కొంత మేర తగ్గవచ్చు. అయితే తమ తమ సినిమాలపై రెండు టీంలకు మంచి నమ్మకం ఉండటంతో ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇద్దరు హీరోలు హిట్లలోనే ఉండడంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
గ్యాంగ్ లీడర్ ఐదుగురు ఆడవారి గ్యాంగ్ తో ముందుకు సాగే ఒక క్రైమ్ కామెడీ. కామెడీ బాగా వర్కు అవుట్ అయ్యిందని సమాచారం. ఇక వాల్మీకి విషయానికి వస్తే తమిళ సూపర్‌హిట్ మూవీ ‘జిగర్తాండ’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ తేజ్ ఈ సినిమాలో నెగటివ్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇదే అతని కేరీర్ లో మొదటి సారి అటువంటి రోల్ చెయ్యడం. ఇటీవలే విడుదలైన టీజర్ లో ఆయనే హైలైట్ గా నిలిచారు.
భోగాపురం విమానాశ్రయానికి ఎప్పుడో ప్రారంభోత్సవం జరిగింది కదా? మళ్ళీ కొత్తగా ఈ ప్రారంభోత్సవం ఏమిటి? అనే సందేహం కలుగవచ్చు. భోగాపురం…
The Andhra Pradesh MPTC and ZPTC election process has entered the next stage, with reports…