Telugu

భోగాపురం విమానాశ్రయంలో మరో ప్రారంభోత్సవం!

భోగాపురం విమానాశ్రయానికి ఎప్పుడో ప్రారంభోత్సవం జరిగింది కదా? మళ్ళీ కొత్తగా ఈ ప్రారంభోత్సవం ఏమిటి? అనే సందేహం కలుగవచ్చు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో మొట్ట మొదటిసారిగా బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి బ్యాగేజీలో భారీగా గంజాయి పట్టుబడింది.

ADVERTISEMENT

అదీ… వంద గ్రాములో అరకేజీయో కాదు ఏకంగా 4.21 కేజీలు. దీని విలువ సుమారు రూ.4 కోట్లు వరకు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు.

నిందితుడిని అదుపులో తీసుకొని ఎయిర్ పోర్ట్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవమైన తర్వాత గంజాయి పట్టుబడటం ఇదే మొదటిసారి.

ఒకప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో గంజాయి సమస్య ఇంతగా ఉండేది కాదు. కానీ గత పదేళ్ళలో ఇది చాలా తీవ్రమైన సమస్యగా మారిపోయింది. ఎంతగా అంటే, ఇటీవల తెలంగాణ యాంటీ నార్కోటిక్ బృందం హటాత్తుగా హైదరాబాద్‌ యూనివర్సిటీలో సోదాలు నిర్వహించి, మాదక ద్రవ్యాలు సేవిస్తునట్లు అనుమానం కలిగిన విద్యార్థులకు వైద్య పరీక్షలు చేశారు. వారిలో 13 మందికి గంజాయి, మాదక ద్రవ్యాలు అలవాటు ఉన్నట్లు గుర్తించారు.

యువత గంజాయి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడటానికి రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని తెలిస్తే షాక్ అవక తప్పదు.

రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు రకరకాల పథకాల పేరుతో యువత చేతిలో డబ్బు పెడుతుండటంతో వారు పనులకు వెళ్ళకుండా ఆ డబ్బుతో వ్యసనాలకు అలవాటు పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వలాభం కోసం యువతకు గంజాయి, మాదక ద్రవ్యాలు అలవాటు చేస్తున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

నిరుద్యోగం, పంటలకు గిట్టుబాటు ధరలు రాకపోవడం వంటి అనేక ఇతర కారణాల వల్ల కూడా యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు.

నేడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏకంగా నాలుగు కోట్లు విలువ గల గంజాయి పట్టుబడటం గమనిస్తే, రెండు రాష్ట్రాల్లో గంజాయికి ఎంత డిమాండ్ ఉందో, ఏ స్థాయిలో వినియోగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

AP MPTC, ZPTC Polls: 46,045 MPTC Nominations Valid

The Andhra Pradesh MPTC and ZPTC election process has entered the next stage, with reports…

40 minutes ago

స్థానిక తుఫాన్ మధ్యలో దూసుకొస్తున్న అర్నాబ్ తుపాను..

ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షాలు, మీడియా, ప్రజలు అందరూ స్థానిక సంస్థల తుఫానులో కొట్టుకుపోతుంటే, మరోపక్క నిజంగానే అర్నాబ్ తుఫాను రాష్ట్రం…

1 hour ago