
అయితే అదుపులోకి తీసుకున్న నిందితుడి వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు. దీంతో ఈ కేసులో కీలక విషయాలన్నీ విశ్లేషిస్తే… మాలీవుడ్ సినీ వర్గాల ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోందని పోలీసులు పేర్కొంటున్నారు. భావన ప్రయాణ వివరాలు సాధారణంగా ఇతరులకు ఎవరికీ తెలిసే అవకాశం లేదు. సినిమా యూనిట్ కు సంబంధించిన వారికి, ఆమె డేట్స్ చూసే వారికి మాత్రమే ఈ వివరాలు తెలిసే అవకాశం ఉంది. అంతే కాకుండా ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్సర్ సుని ప్రధాన వ్యాపకం… అశ్లీల సమాచారాన్ని సినీ పెద్దలకు చేరవేయడమే. దీంతోనే అతనికి సినీ పెద్దలతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి.
దీంతో అతను ఈ దారుణానికి తెగించడం వెనుక పలువురు ఉన్నారని, వారందర్నీ వెలుగులోకి తీసుకొస్తామని పోలీసులు చెబుతున్నారు. కాగా ఈ మధ్య వివాహం చేసుకున్న దిలీప్ అనే నటుడితో భావన గతంలో సన్నిహితంగా ఉండేదని, అతను అకస్మాత్తుగా మరో నటిని వివాహం చేసుకోవడంతో వారి మధ్య చెడిందని, దీంతో ఆమెపై కక్షగట్టి అతనే ఈ పని చేయించి ఉంటాడన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. భావన నటిస్తున్న సినిమా యూనిట్ లోని నలుగురు సభ్యులపై పోలీసులు నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. వారే పల్సర్ సునీల్ తో కుమ్మక్కై ఆమెకు సంబంధించిన సమాచారం అందజేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…