
డబ్బులు అకౌంట్ లో పడగానే ఫోన్ కట్టేసి వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిపోయారు ఆయన. అప్పటికే ఆదాల పేరు అధిరికంగా ప్రకటించెయ్యడంతో టీడీపీకి ఇది పెద్ద షాక్. ఆదాల చేసిన మోసం అంతా ఇంతా కాదని టీడీపీ వర్గాలు వాపోయాయి. కట్నం తీసుకుని పెళ్లి పీటల మీద నుండి పారిపోయాడు అని చంద్రబాబు ఆయన మీద విరుచుకుపడ్డారు. ఆయనకు వ్యతిరేకంగా అజీజ్ ను నిలబెట్టారు చంద్రబాబు. మోసం చేసిన ఆదాలను ఎలాగైనా ఓడించాలని తెలుగు తమ్ముళ్లు విశ్వప్రయత్నం చేశారట.
పోలింగ్ తరువాత స్వల్ప ఆధిక్యతతోనైనా ఈ సీటును గెలుస్తామని ధీమాగా ఉన్నాయి తెలుగుదేశం శ్రేణులు. అయితే ఆదాల పెట్టిన ఖర్చుకు అజీజ్ తట్టుకోలేకపోయారు విజయం మాదే అంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు. ఆదాల చేసిన పనికి ఆయన ఈ ఎన్నికలలో ఓడిపోతే ఆయన రాజకీయ మనుగడే కష్టంగా మారిపోతుంది. ఆయన ఓడి జగన్ కూడా ఓడితే ఇక రాజకీయాల నుండి తప్పుకోవాల్సి పరిస్థితి రావొచ్చు. అందుకే ఆదాల మే 23వరకు టెన్షన్ గా వేచి చూస్తున్నారు.
Prabhas and director Maruthi’s film Raja Saab turned out to be one of the biggest…
Union Minister and Karimnagar MP Bandi Sanjay’s son Bandi Bhageerath had been in the news…