Telugu

ఆదానీకి ఏపీ సర్కార్ గులామ్… కృష్ణపట్నంకి ఎసరు అందుకేనా?

రాష్ట్ర విభజనతో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రప్పించాల్సిన జగన్ ప్రభుత్వం, ఆదానీకి దోచిపెడుతుండటం చాలా విస్మయం కలిగిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో పాడిపరిశ్రమను, ముఖ్యంగా టిడిపి నేతల డెయిరీలను దెబ్బతీయడానికి గుజరాత్‌ నుంచి అమూల్‌ని దింపిన జగన్ సర్కార్, ఆదానీకి లబ్ది కలిగేవిదంగా వ్యవహరిస్తోంది.

ఉదాహరణకు మద్యప్రదేశ్‌లోని అత్యంత నాణ్యమైన బొగ్గు గనులపై ఏపీ ఎండీసీ హక్కులు కలిగి ఉంది. అక్కడ గనుల నుంచి ఏడాదికి 5 మిలియన్ టన్నుల చొప్పున 22 ఏళ్ళు పాటు నిరంతరంగా తవ్వుకొన్నా తరగనంత బొగ్గు ఆ గనుల్లో ఉంది. కనుక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ధర్మల్ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు అవసరాలకు సరిపడా బొగ్గు లభిస్తుందనే ఉద్దేశ్యంతో గత ప్రభుత్వ హయాంలో ఆ గనులను ఏపీ ఎండీసీ దక్కించుకొంది. కనుక అక్కడ ఏ సంస్థ బొగ్గు తవ్వి వెలికి తీసినా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రాధాన్యత ఉంటుందని ఆశించడం సహజమే.

ADVERTISEMENT

కానీ ఆ గనులలో బొగ్గు తవ్వితీసే కాంట్రాక్టుని అదాని సంస్థ దక్కించుకోవడంతో దానిలో 75శాతం ఆ సంస్థకే వెళ్లిపోతోంది. అక్కడ తవ్వి వెలికి తీసిన అత్యంత నాణ్యమైన బొగ్గును బహిరంగ మార్కెట్‌లో వేలం వేయాలనే నిబందన ఉంది. ఆ గనులపై ఏపీ ఎండీసీ హక్కులు కలిగి ఉన్నందున ఆ వేలంపాటలో ఏపీ జెన్‌కో కూడా పాల్గొని ఉండి ఉంటే దానికే తొలి ప్రాధాన్యం లభించి ఉండేది. కానీ అది వేలంపాటలో పాల్గొనకపోవడంతో దానిని ఆదాని సంస్థ దక్కించుకొంది.

విదేశీబొగ్గుతో సమానమైన నాణ్యత కలిగిన ఆ బొగ్గు ధర బహిరంగ మార్కెట్లో టన్ను రూ.5,300 నుంచి రూ.8,000 వరకు పలుకుతుండగా, ఆదానీ సంస్థ కేవలం రూ.3,200కి ఎగరేసుకుపోయింది. అదే ఏపీ జెన్‌కో కూడా పాల్గొని ఉండి ఉంటే అంత నాణ్యమైమన బొగ్గు అతి తక్కువ ధరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికే దక్కి ఉండేది. అది దక్కితే విద్యుత్‌ ఉత్పత్తి ఖర్చు తగ్గి, విద్యుత్ ఛార్జీలు తగ్గించే అవకాశం ఉండేది. కానీ ఆ వేలంపాటలో ఏపీ జెన్‌కో ఎందుకు పాల్గొనలేదో తెలీదు. బహుశః ఆదానీ సంస్థకి లబ్ది కలిగించడానికే వెనక్కు తగ్గి ఉండవచ్చునని గుసగుసలు వినిపిస్తున్నాయి. కృష్ణపట్నం ధర్మల్ విద్యుత్ కేంద్రానికి బొగ్గు కొరత ఉన్నందున దానిని ప్రైవేట్ (అదాని) పరం చేసేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఈ బొగ్గు తవ్వకం కాంట్రాక్ట్ దక్కించుకొన్న అదానీ సంస్థ రోజుకి సుమారు లక్షన్నర టన్నుల చొప్పున 2025 వరకు బొగ్గును తవ్వి తీసుకొంటుంది. ఒకవేళ కృష్ణపట్నం ధర్మల్ విద్యుత్ కేంద్రం దానికి చేతికి వస్తే ఈ బొగ్గుతో అది విద్యుత్ ఉత్పత్తి చేసుకొని అక్కడా భారీగా లాభాలు ఆర్జించుకోవడం ఖాయం. ఒకవేళ దానిని యదాతధంగా నడిపించాలని ప్రభుత్వం భావిస్తే దానికి అవసరమైన బొగ్గుని అదానీ సంస్థకు అదనంగా సొమ్ము చెల్లించి కొనుగోలు చేసినా ఆశ్చర్యం లేదు. అంటే బొగ్గు, డబ్బు అదానీకి దాని మసి మాత్రం రాష్ట్రానికి అన్నమాట!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

VJA Mayor Race: ABV Takes on Vangaveeti Radha, Bhagya Lakshmi

Retired IPS officer AB Venkateswara Rao is set to contest the Vijayawada Municipal Corporation mayoral…

3 minutes ago

Nani, Vijay Chase Mass Stardom: Can Nithiin Benefit?

Nani and Vijay Deverakonda are moving away from the romantic entertainers and emotional dramas that…

1 hour ago