Telugu

తమిళ అర్జున్ రెడ్డి కొత్త టీజర్… ఈ సారి వర్క్ అవుట్ అయ్యింది

తెలుగులో పెద్ద హిట్ అయ్యి విజయ్ దేవరకొండకు స్టార్ డమ్ తెచ్చిపెట్టిన సినిమా అర్జున్ రెడ్డి. తమిళ్ లో హీరో విక్రమ్ కొడుకు ధృవ్ ఈ సినిమాతో తెరంగేట్రం చేస్తున్నాడు. బాలా దర్శకత్వంలో వర్మగా ఆ సినిమా తీశారు. అయితే ఓ సారి సినిమాను పూర్తి చేసి ఆపేసి మ‌ళ్లీ ఇప్పుడు రెండో సారి సినిమాను వేరే దర్శకుడితో పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు వర్మ కాస్త ఆదిత్య వర్మ అయ్యింది. రీ-షూట్ తరువాత ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ కాసేపటి క్రితం విడుదల అయ్యింది.

ఈ సారి క్రియేటివిటీ వాడ‌కుండా.. ఉన్న‌ది ఉన్న‌ట్లు దించేసారు. ఈరోజు విడుదలైన ఈ చిత్ర టీజ‌ర్ ముందు దానికంటే బెటర్ గా ఉంది. అయితే తెలుగులో అర్జున్ రెడ్డిగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను చూసిన క‌ళ్ల‌తో అక్క‌డ ధృవ్ విక్ర‌మ్‌ను చూడ‌లేక‌పోతున్నారు ప్రేక్ష‌కులు. అయితే త‌మిళ ప్రేక్ష‌కులకు మాత్రం ధృవ్ క‌చ్చితంగా న‌చ్చేలా ఉన్నాడు. మన తెలుగువారికి నచ్చుతుందో లేదో తెలీదు గానీ తమిళ ప్రేక్షకులకు నచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ధృవ్ ఈ సినిమాతో స్థిరపడతాడేమో చూడాలి.

ADVERTISEMENT

ధృవ్‌ సరసన బనిటా సంధు హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను ఈ4 ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. హీరోయిన్ పెద్దగా టీజర్ లో కనిపించలేదు, మెప్పించలేదు. అర్జున్ రెడ్డి సినిమా హిందీ రీమేక్‌ జూన్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుండగా తమిళ వర్షన్‌ షూటింగ్‌ కూడా చివరి దశకు చేరుకుంది. తొందరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తుంది చిత్ర యూనిట్. హిందీ రీమేక్ కు ఒరిజినల్ కు దర్శకత్వం వహిస్తున్న సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్నాడు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

AI Teaser, Pooja Hegde Bikini Buzz Failed? Trailer Only Hope

Hai Jawani Toh Ishq Hona Hai, starring Varun Dhawan, Pooja Hegde, and Mrunal Thakur, has…

46 seconds ago

The “Anna” Touch: Vijay Revives Political Decorum

CM Vijay is proving that "elevation" isn’t just about winning elections; it’s about how you…

31 minutes ago