
అయితే ఈ సీక్వెల్ లో విశ్వక్ సేన్ నటించడం లేదంట… అతని స్థానంలో అడివి శేష్ హీరోగా ఉంటాడని సమాచారం. చిత్రంలో మిగతాదంతా సేమ్ అంటున్నారు. నాని నిర్మాతగా ఉంటాడు అలాగే హిట్ దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. వచ్చే ఏడాది మార్చి లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది.
అడివి శేష్ ప్రస్తుతం మేజర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మార్చి నుండి ఈ సినిమా మొదలుపెడతాడు. కేవలం మూడు నాలుగు నెలల్లో షూటింగ్ పూర్తి చెయ్యాలని టార్గెట్ గా పెట్టుకున్నారట. మరోవైపు మొన్న ఆ మధ్య హిట్ సినిమా బాలీవుడ్ రీమేక్ ని కూడా ప్రకటించారు. బాలీవుడ్ స్టార్ నటుడు రాజ్‌కుమార్ రావు నటించనున్నారు.
ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో దిల్ రాజు నిర్మించనున్నారు. శైలేష్ దానికి దర్శకత్వం వహిస్తారని ప్రకటించారు. అయితే ఆ సినిమా ఇప్పటివరకు సెట్స్ మీదకు వెళ్ళలేదు. ఆ సినిమా ఎప్పుడు జరుగుతుంది అనేది ఐడియా లేదు. కరోనా కారణంగా ఆ సినిమా వాయిదా పడిందా అనేది తెలియాల్సి ఉంది.
Prabhas fans finally have an update on Fauzi ahead of the actor’s birthday on October…
విజయవాడ మేయర్ అభ్యర్ధిగా బరిలో దిగిన మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు (ఏబీవి) నేడు ప్రెస్‌మీట్ పెట్టి…