
“ఉప్పెన” లాంటి ఓ మిడ్ రేంజ్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన బుచ్చి బాబు అనంతరం ఎన్టీఆర్ తో సినిమా అనౌన్స్ చేసి ఇండస్ట్రీకి షాక్ ఇచ్చాడు. అలాంటి సినిమా తర్వాత ఎన్టీఆర్ ఛాన్స్ ఇవ్వడం ఏంటి.. అది కూడా స్పోర్ట్స్ డ్రామా అని అందరూ నోరెళ్లబెట్టారు. అయితే.. ఆ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ నుండి రామ్ చరణ్ కి చేతులు మారింది. ఎన్టీఆర్ స్వయంగా చరణ్ కి కథ చెప్పించి మరీ బుచ్చికి ఓకే చేయించాడు.
చరణ్-బుచ్చి కాంబినేషన్ అనేది మొదలైనప్పుడు.. జాన్వీ కపూర్ హీరోయిన్, రెహమాన్ సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ ఇలా పెద్ద పెద్ద పేర్లతో ప్రకంపనలు సృష్టించింది. ఓపెనింగ్ మొదలుకొని రిలీజ్ వరకు సినిమాకి ఉన్న బజ్ వేరు. ప్రతి ప్రమోషనల్ కంటెంట్ తో షాక్ ఇచ్చాడు బుచ్చి. పాటలు, టీజర్లు, ప్రోమోలు అన్నీ అదిరిపోయాయి. ట్రైలర్ మాత్రం మెప్పించలేకపోయింది. దాని ఎఫెక్ట్ ఓపెనింగ్స్ మీద పడింది.
అయితే.. సినిమా రిలీజ్ అయ్యేసరికి సీన్ మొత్తం మారిపోయింది. సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో బుచ్చిబాబుని “తల” అని పిలుస్తూ ఆకాశానికెత్తేసిన మెగా ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా కిందకి వదిలేశారు. జాన్వీ పాత్ర విషయంలో జరిగిన రచ్చ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఫ్యాన్స్ ఏదో కవర్ చేసుకుంటున్న తరుణంలో అపాలజీ పోస్ట్ పెట్టి తాను చేసింది తప్పే అని క్లారిటీ ఇచ్చేశాడు. దాంతో ఫ్యాన్స్ కూడా సైలెంట్ అయిపోయారు.
ఇప్పుడు బుచ్చిబాబు నెక్స్ట్ సినిమా ఎవరితో అనేది హాట్ టాపిక్ గా మారింది. మహేష్ కి కథ చెప్పనున్నాడని, ఆ ప్రాజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చిన బుచ్చికి మహేష్ ఫ్యాన్స్ కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అసలు ఇప్పుడు “పెద్ది”కి వచ్చిన రెస్పాన్స్ బట్టి బుచ్చిబాబుకి మళ్లీ మరో స్టార్ హీరో అవకాశం ఇచ్చే అవకాశం ఉందా? అనేది పెద్ద ప్రశ్న. కుదిరితే బుచ్చిబాబు మళ్లీ ఒక మిడ్ రేంజ్ హీరోతో మరో హిట్టు సినిమా తీసి తనను తాను నిరూపించుకొని అప్పుడు స్టార్ హీరోలని అప్రోచ్ అవ్వడం బెటర్. లేదంటే.. స్టార్ హీరోల చుట్టూ తిరగడంతోనే టైమ్ వేస్ట్ అయిపోతుంది.
The grand launch of the M.S. A Legacy On Screen Launch event was held at…
An Instagram reel showing a chariot procession in Lewisham, London, has gone viral. The footage…