
ఈ సినిమాకు సంబంధించిన ధియేటిరికల్ ట్రైలర్ ను తాజాగా విజయ్ జన్మదినం సందర్భంగా విడుదల చేసారు. తమిళంలో ఇప్పటికే సూపర్ హిట్ కావడంతో, తెలుగులో అదే ఫలితాన్ని అందిపుచ్చుకుంటుందని భావిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ పై సినిమా ఎలా ఈ ట్రైలర్ మాత్రం వీక్షకులను మెప్పించలేకపోయిందనేది చిత్ర యూనిట్ తెలుసుకోవాల్సిన విషయం. ఇలాంటి ట్రైలర్ ను విడుదల చేయడం కంటే కూడా, ట్రైలర్ లేకుండా నేరుగా సినిమాను విడుదల చేస్తే… మూవీ బాగుంటే మంచి ఫలితాన్ని అందిపుచ్చుకోవచ్చు.
దాదాపుగా రెండు నిముషాల పాటు ఉన్న ఈ ట్రైలర్ ఎప్పుడు అయిపోతుందా అని వేచిచూడడం ప్రేక్షకుల వంతవుతోంది అని చెప్పడంలో సందేహం లేదు. దీనికి తోడు ఏ మాత్రం పస లేని సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం… దేవుడా… అనిపించక మానదు. ఇక ట్రైలర్ లో చెప్పుకోవాల్సిన ప్లస్ పాయింట్ ఏమైనా ఉంది అంటే… అది హీరోయిన్ కీర్తి సురేష్ లుక్ మాత్రమే అని చెప్పాలి. అయితే ఎలాంటి ప్రయోగాలకు తావు లేని పక్కా కమర్షియల్ సినిమా కావడంతో మాస్ కైనా ఎక్కుతుందేమో చూడాలి.
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…
Dulquer Salmaan's I'm Game directed by Nahas Hidhayath, is gearing up for a worldwide theatrical…