
“బాహుబలి” ఫస్ట్ పార్ట్ రికార్డులను తుడిచివేసి, రెండవ పార్ట్ దరిదాపుల్లోకి వచ్చే సినిమాగా “అజ్ఞాతవాసి” దారులు తెరుచుకుంటున్నాయనే చర్చ జరుగుతోంది. సహజంగానే సంక్రాంతి సినిమాలకు ప్రేక్షకులు ఒక రేంజ్ లో పట్టం కడతారు. అలాంటిది త్రివిక్రమ్ కాంబోలో పవన్ కళ్యాణ్ సినిమా అంటే… ఆ ఊపు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో టికెట్ ధరల పెంపు ఖాయం కావడంతో, “అజ్ఞాతవాసి” ఫస్ట్ డే ఆల్ టైం రికార్డు సృష్టిస్తుందన్న నమ్మకాలు ఎక్కువయ్యాయి.
గత కొంతకాలం నుండి పెద్ద సినిమాల టికెట్ ధరల పెంపుకు వెసులుబాటు కల్పిస్తున్న రెండు తెలుగు ప్రభుత్వాలు, ఇక నుండి పెంచిన ధరలను ఫిక్స్ డ్ గానే ఉంచబోతోందన్నది లేటెస్ట్ న్యూస్. దీంతో “అజ్ఞాతవాసి” నుండి అన్ని పెద్ద సినిమాలకు ఫస్ట్ డే నాడు వాళ్ళ వాళ్ళ కెరీర్ లలో భారీ రికార్డులు నమోదయ్యే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి. అయితే “అజ్ఞాతవాసి”పై అందరి ఆసక్తి ఎందుకంటే… ‘బాహుబలి 2’ రికార్డులను టచ్ చేయాలంటే అది పవన్ వల్లే సాధ్యమని ట్రేడ్ వర్గాల అంచనా.
Just two hours after polling began in Andhra Pradesh's municipal and corporation elections, several areas…
Trivikram Srinivas is once again facing questions over whether he is delivering films that match…