Telugu

ఏఐ: అర్థమైతే అవకాశం… కాకపోతే ఆందోళన!

దశాబ్దం క్రితం ఏఐ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఏఐ మానవ జీవితంలో మంచి, చెడు విషయాలలో భాగమైపోయిందంటే అతిశయోక్తి కాదు. అయితే ఏఐ వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతుండటంతో దాని దుష్ప్రభావాలే ఎక్కువగా హైలైట్ అయ్యాయి. దాని పట్ల ప్రజల్లో దురభిప్రాయం నెలకొంది.

కంప్యూటర్లు వచ్చిన కొత్తలో ఇలాగే ఉద్యోగాలు పోతాయని చాలామంది ఆందోళన చెందారు. కానీ కంప్యూటర్ల ప్రవేశం తర్వాతే డేటా ఎంట్రీ ఆపరేటర్లు మొదలు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, వెబ్ డెవలపర్లు, ఐటీ నిపుణులు వంటి లక్షలాది కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి కొత్త జీవితాలను ప్రసాదించాయి. మనుషులు మరింత సుఖంగా, సులువుగా, సౌలభ్యంగా జీవనం సాగించేందుకు కంప్యూటర్లే దోహదపడుతున్నాయి.

ADVERTISEMENT

అదేవిధంగా ఏఐని కూడా అన్ని రంగాలు విరివిగా వాడుకుంటున్నాయి. నిరంతరాయంగా పనులు చక్కబెట్టగలగడం, పనిలో నాణ్యత, అపరిమితమైన వేగం, అపరిమితమైన సమాచారం వంటి ఎన్నో విషయాలు ఏఐ ద్వారానే సాధ్యపడుతున్నాయి. కనుక మనుషులు చేయగల అనేక పనులను ఏఐ చక్కబెట్టేస్తుండటంతో ఆ మేరకు ఉద్యోగాలు కోల్పోవడం సహజమే. కానీ అదే ఏఐని వాడుకొని లబ్ధి పొందుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.

కస్టమర్ సపోర్ట్, డేటా ఎంట్రీ, సాధారణ అనువాదాలు వంటి కొన్ని ఉద్యోగాలపై ఏఐ ప్రభావం పడుతున్నప్పటికీ, మరోవైపు ఏఐ ట్రైనర్, ప్రాంప్ట్ ఇంజినీర్, డేటా సైంటిస్ట్, ఏఐ భద్రతా నిపుణుడు వంటి కొత్త ఉద్యోగాలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఒకప్పుడు కంప్యూటర్లు కొత్త అవకాశాలను సృష్టించినట్లే, ఏఐ కూడా కొత్త ఉపాధి మార్గాలకు తలుపులు తెరుస్తోంది.

కనుక చరిత్ర నుంచి నేర్చుకోవాల్సింది ఒక్కటే. ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న ఇటువంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల కలిగే నష్టాలను చూసి భయపడుతూ, దానిని అర్థం చేసుకోలేక భయాందోళనలతో గుడ్డిగా వ్యతిరేకిస్తుంటే ఈ పోటీ ప్రపంచంలో వెనుకబడిపోయి మనమే నష్టపోతాము.

కనుక ఏఐ పట్ల అవగాహన పెంచుకునేందుకు చదువు, వయసు, భాష వంటి పరిమితులను అవరోధంగా భావించే బదులు, ఆ పరిమితులలోనే ఏఐని మనం ఏ విధంగా వాడుకొని లబ్ధి పొందగలమని ఆలోచిస్తే ఏఐ మనకు శత్రువు లేదా పీడకలగా కాక ఆత్మీయుడిలా మన వెన్నంటి ఉంటూ తోడ్పడుతూనే ఉంటుంది.

బడిలో పిల్లాడికి ఇంగ్లీష్ లేదా లెక్కలు అర్థం కానప్పుడు భయం, ఆందోళన ఉంటాయి. కానీ అర్థమైనప్పుడు వాటిలో రాణిస్తాడు. ఏఐ కూడా అంతే!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

AK47: Trivikram & Naga Vamsi Fumble Golden Dasara Window

Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…

1 hour ago

New Passport Rules for Minors NRI Parents Must Know

The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…

1 hour ago