
వినియోగదారులు నెంబర్ పోర్టబిలిటీ సౌకర్యాన్ని ఎయిర్‌టెల్, ఐడియా, వోడాఫోన్ తదితర సంస్థలు అడ్డుకుంటున్నాయంటూ, కస్టమర్లు కొత్త నెట్‌వర్క్ కు మారేందుకు ఈ సంస్థలు అంగీకరించడం లేదని పేర్కొంది. యూజర్ల రిక్వెస్టులను ఆయా సంస్థలు నిర్దాక్షిణ్యంగా అడ్డుకుంటున్నాయని, ఈ నెల 9 నుంచి 12వ తేదీ మధ్య కాలంలో నెంబర్ పోర్టబిలిటీ కోసం వినియోగదారులు చేసుకున్న దరఖాస్తులను తిరస్కరించాయని వివరించింది.
ఇవి కాక, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉద్యోగులు చేసుకున్న 4,919 రిక్వెస్టులు వీటికి అదనమని పేర్కొంది. ఆయా సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొంటూ చర్యలు తీసుకోవాల్సిందిగా ‘ట్రాయ్’కు లేఖ రాసింది. ఇటువంటి సంస్థల లైసెన్స్ లు రద్దు చేయాలని ట్రాయ్ ను రిలయన్స్ కోరింది. మరోవైపు రిలయన్స్ ఆరోపణలపై సదరు సంస్థలు ప్రతిస్పందించకపోవడం విశేషం.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…