‘శాడిస్ట్ పోలీస్’కు ‘బాహుబలి 2’లో అవకాశం!

తెలుగు, తమిళ సినిమాలలో ఇటీవల కాలంలో ‘శాడిస్ట్ పోలీస్’ పాత్రలను వెండితెరపై అద్భుతంగా పండిస్తున్న అజయ్ గోష్ కు ఓ అరుదైన అవకాశం తలుపు తట్టింది. కనీసం ఒక సీన్ లో అయినా “బాహుబలి 2”లో కనిపిస్తే చాలు అని హేమాహేమీ నటులే బహిరంగ ప్రకటనలు చేస్తున్న తరుణంలో… అజయ్ గోష్ కు మాత్రం “బాహుబలి 2” సినిమాలో ఓ కీలక పాత్ర వరించడం విశేషం.

దొంగలను ప్రాతినిధ్యం వహించే ముఠా నాయకుడి పాత్రలో అజయ్ గోష్ కనపడనున్నారని సమాచారం. నటులను ఎంపిక చేయడంలో మరియు వారికి మరింతగా పేరు ప్రఖ్యాతలు తెప్పించడంలో రాజమౌళిది అందెవేసిన చేయి. ‘బాహుబలి’ సినిమాలో ప్రభాకర్ కు కూడా అలాంటి లైఫ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘బాహుబలి’ తర్వాత ఏకంగా ప్రభాకర్ ప్రధాన పాత్రలో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది అంటే అది జక్కన్న ‘బాహుబలి’ పుణ్యమే! మరి ‘శాడిస్ట్ పోలీస్’ పాత్రలకు పర్యాయపదంగా నిలుస్తున్న అజయ్ గోష్ కు కూడా అలాంటి బ్రేక్ లభిస్తుందేమో చూడాలి

ADVERTISEMENT
Share
Published by

Recent Posts

Couple Delays Indigo Flight, Verbally Abuses Passengers

An IndiGo flight travelling from Navi Mumbai to Mangalore was delayed by more than an…

5 minutes ago

ద్రవిడ పార్టీల ఆరాటం విజయ్‌ కోసం కాదు…

తమిళనాడు ఎన్నికలలో అధికార డీఎంకే అధినేత స్టాలిన్‌తో సహా ఆ పార్టీ ఓడిపోయింది. కానీ కేవలం రెండు మూడు రోజుల్లోనే…

38 minutes ago