
“తమకు బద్ధ శత్రువుగా భావిస్తున్న బీజేపీతో దోస్తీ కడతామంటూ” అక్బరుద్దీన్ ఆ ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని దేశం నుంచి తరిమికొట్టేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ఓవైసీ ప్రకటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపైనే కాక, ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలపై సైతం అక్బరుద్దీన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘‘కాంగ్రెస్ పార్టీని దేశమంతా వెంటాడతా. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి కాంగ్రెస్ ను సర్వనాశనం చేసి… ఆ శవాన్ని మోదీతో కలిసి మోస్తా. ఇందిరా గాంధీ దారుస్సలాం (మజ్లిస్ కార్యాలయం) గడప తొక్కింది. మేమెప్పుడూ గాంధీ భవన్ గడప తొక్కం. కానీ సోనియా, రాహుల్ గాంధీలతో దారుస్సలాం గడప నాకిస్తా’’ అని ఆయన ఘాటు పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇంకా ఆ వీడియోలో ఏమన్నారో చూడండి…
Mirzapur: The Film was released recently and had a huge box office opening. It received…
The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…