Telugu

2 గంటలు పూనకాలంట… వింటున్నారా..?

మరో రెండు రోజుల్లో నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన “అఖండ” సిల్వర్ స్క్రీన్ పై ప్రత్యక్షం కాబోతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే ఆకాశంలో ఉండగా, దానిని మరింత పెంచే విధంగా నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి వ్యాఖ్యలు నిలుస్తున్నాయి.

సినిమా రన్ టైం మొత్తం 2 గంటల 47 నిముషాలు ఉండగా, 47 నిముషాలు తీసేస్తే 2 గంటల పాటు ప్రేక్షకులను ఉర్రూతలూగించే విధంగా ఉంటుందని, ఇది తాను ఎక్కువ చేసి చెప్పడం లేదని, నిజంగానే సినిమా అలా ఉంటుందని, ఈ సినిమాలో నచ్చే సీన్స్ చాలా ఉన్నాయని నిర్మాత చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ నుండి క్లైమాక్స్ వరకు ఒక రేంజ్ లో ఉంటుందని అన్న నిర్మాత మిరియాల మాటలు నందమూరి అభిమానులకు ముత్యాల పలుకులులాగా వినపడుతున్నాయి. అయితే నిర్మాత గారు చెప్తోన్న సంగతులు మరీ ఎక్కువ కాదు కదా… అన్న డైలాగ్స్ కు సోషల్ మీడియాలో కొదవలేదు.

ముఖ్యంగా బాలకృష్ణ సినిమాలలో ఓవర్ హైప్ గా వచ్చిన ‘పలనాటి బ్రహ్మనాయుడు, ఒక్క మగాడు’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాలను చవిచూశాయి. అప్పట్లో ఆ దర్శకనిర్మాతలు కూడా ఇలాగే సినిమా మొత్తం మోత మోగిపోతుందని అంచనాలను పెంచేశారు. అంతిమంగా అభిమానుల ఆగ్రహానికి ఆ చిత్ర యూనిట్స్ గురి కావాల్సి వచ్చింది.

చాలాకాలం తర్వాత బాలకృష్ణ నటించిన ఓ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బోయపాటి దర్శకుడు కావడం, అదిరిపోయే డైలాగ్స్ తో ట్రైలర్, టీజర్లు కట్ చేయడం, ‘అఖండ’ క్యారెక్టర్ లుక్ లో బాలయ్య అద్భుతంగా ఉండడంతో ఏర్పడ్డ భారీ అంచనాలు సాకారం అయ్యి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాంచి ఊపునివ్వాలని ఆశిద్దాం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by
Tags: Akhanda

Recent Posts

KTR’s Special Interest In Nani’s The Paradise

KTR is heading to watch The Paradise tonight, and there is an obvious reason why…

35 minutes ago

జైలర్-2 ఓకే.. గరివిడి లక్ష్మి కూడా ఓకేనా?

ప్రైవేట్ ట్రావెల్స్ వార్త అంటే అగ్నిప్రమాదాలే అన్నట్లు తెలుగు సినిమాలంటే ‘కొరుకుడు.. నరుకుడే’ అన్నట్లుగా మారాయని చెప్పక తప్పదు. మన…

53 minutes ago