Telugu

ఫ్యాన్స్ ను ఓ రేంజ్ లో ఊరిస్తున్నారుగా!

‘మనం’ చిత్ర దర్శకుడు విక్రం కే కుమార్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటిస్తున్న రెండవ సినిమాకు సంబంధించి ఈ నెల 21వ తేదీన టైటిల్ ప్రకటన ఉండనుంది. ఇప్పటికే ఈ సినిమా స్టిల్ లీక్ కావడంతో, అధికారికంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్ కు సంబంధించి ఫ్యాన్స్ కు మాంచి పజిలే విసిరారు ‘కింగ్’ నాగార్జున. తన “నిర్ణయం” సినిమాలో ఓ 20 సెకన్ల నిడివి గల పాటను అప్ లోడ్ చేసి, ఇందులో అఖిల్ రెండవ సినిమా టైటిల్ ఉంది, గెస్ చేయండి… అంటూ ఫ్యాన్స్ కు పిలుపునిచ్చారు.

స్వయంగా తమ అభిమాన హీరోనే పిలుపునిస్తే ఆగుతారా… ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెలరేగిపోతూ… “హలో గురూ ప్రేమ కోసమే” నుండి ‘మగాడితో ఆడదానికేలా పౌరుషం” వరకు అనేక టైటిల్స్ ను నాగ్ కు రిప్లై ఇస్తున్నారు. మరో హింట్ ఏమిటంటే… ఈ పాటలో నాగ్, అమల జంటగా ఆలపించగా, ఆదివారం నాడు చైతూ – సమంతల పాటను కూడా అప్ లోడ్ చేస్తానని చెప్పారు. అంటే ఈ రెండింటిలో కలిపి ఉన్న పదాలే అఖిల్ రెండవ సినిమా టైటిల్ గా 21వ తేదీ నాడు కింగ్ ప్రకటించనున్నాడన్న మాట.

ADVERTISEMENT

అయితే ‘మనం ఎంటర్ ప్రైజెస్ బ్యానర్’లో ఇప్పటికే “హలో” అనే టైటిల్ ను రిజిస్టర్ చేసి ఉండడంతో, ఆ పాటలోని మొదటి పదమే అఖిల్ సినిమా టైటిల్ అన్న విషయం దాదాపుగా ఖరారైన విషయం. వినూత్నమైన కధలను తెరకెక్కించే విక్రం, ఈ ‘హలో’ టైటిల్ తో అఖిల్ ను ఏ విధంగా చూపించబోతున్నారో తెలియాలంటే, కనీసం ఓ టీజర్ అయినా వదలాల్సిందే. బహుశా ‘కింగ్’ పుట్టినరోజు ఈ నెలలోనే కావడంతో, బహుశా ఆ రోజున అఖిల్ సినిమా టీజర్ విడుదల కావచ్చని తెలుస్తోంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

15 Years Later, Panjaa Proves Pawan Craze Never Fades

Pawan Kalyan’s birthday has turned into a celebration on the big screen as Panjaa returns…

5 minutes ago

Devudichhina Annayya: Lokesh’s Hearty Wish To PK!

Pawan Kalyan was one of the individuals to firmly stand by the Chandrababu Naidu family…

41 minutes ago