
ఇంతకీ… సదరు అభిమాని కనిపెట్టినది ఏమిటంటే… అఖిల్ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ సేవర్ గా ‘ఏఎన్నార్’ ఫోటో ఉండడాన్ని గమనించిన ఓ అభిమాని, దానిని కోట్ చేస్తూ అఖిల్ కు ట్వీట్ చేసారు. ఇందులో గొప్పతనం ఏమిటంటే… అసలు ఆ స్క్రీన్ సేవర్ ఎంతో పరిశీలిస్తే గానీ కనపడే అవకాశం లేదు. ఈ విషయాన్ని గమనించిన అఖిల్, సదరు ట్వీట్ కు రిప్లై ఇచ్చారు.
సాధారణంగా ఇలాంటి వాటిని నేను ట్వీట్ చేయను గానీ, దీనిని గమనించడం సాధారణ విషయం కాదు ఫ్రెండ్… ఇంక్రేడిబుల్… చూడగానే నవ్వు ఆపుకోలేకపోయాను… అంటూ సదరు ట్వీట్ కు సమాధానం ఇచ్చారు. ఒక్క అఖిల్ మాత్రమే కాదు, ఈ ట్వీట్ హీరో సుమంత్ కూడా స్పందించారు. ‘అఖిల్ ఫోన్ ఆ స్క్రీన్ సేవర్ ఎప్పటి నుండో ఉందని’ సమాధానం ఇచ్చారు. సాధారణంగా కొన్ని వందల కొద్ది ట్వీట్స్ హీరోల ఖాతాలో వచ్చి పడుతుంటాయి. అలా వాటిని గమనిస్తూ రిప్లైలు ఇవ్వడం అనేది అభిమానులపై ఉన్న ప్రాధాన్యతను ప్రతిబింభిస్తోంది.
NTR is currently focused on his ongoing project Dragon, which marks his collaboration with Prashanth…
Anjana Rangan is giving black-and-gold dressing a confident new attitude. In a sleeveless floral brocade…