
ఆ తర్వాత “రాజు గారి గది 2, రాజా ది గ్రేట్” సినిమాలు కమర్షియల్ బొమ్మలుగా నిలిచినప్పటికీ, హీరోల స్థాయిని అందుకోవడంలో విఫలమయ్యాయి. ఊహించని రీతిలో రాజశేఖర్ “పీఎస్వీ గరుడవేగ” సినిమాకు అటు విమర్శకులు, ఇటు ప్రేక్షకులు పట్టం కట్టారు గానీ, కలెక్షన్ల రూపంలో అవి తారసపడకపోవడం విశేషం. అలాగే “నెక్స్ట్ నువ్వే, గృహం, మెంటల్ మదిలో” సినిమాలకు విమర్శకుల నుండి ప్రశంసలు లభించాయి గానీ, ప్రేక్షకులు ఏ మాత్రం కనికరించలేదు.
డైరెక్ట్ సినిమాలతో పాటు డబ్బింగ్ బొమ్మలుగా “అదిరింది, కేరాఫ్ సూర్య, ఖాకీ, డిటెక్టివ్, ఇంద్రసేన” సినిమాలు వచ్చాయి గానీ, వాటిలో ఒక్కటి కూడా బాక్సాఫీస్ వద్ద ప్రభావితం చూపలేకపోయాయి. తాజాగా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాలలో కాస్తో కూస్తో “జవాన్” సినిమా ప్రేక్షకులను అలరించే విధంగా టాక్ తెచ్చుకుంది గానీ, బాక్సాఫీస్ వద్ద ఎంతటి ప్రభావం చూపుతుందనేది ప్రశ్నార్ధకమే. అయితే సెకండాఫ్ లో క్లైమాక్స్ లో ట్విస్ట్ లు ఇచ్చేందుకు రెండు సినిమాలు రెడీగా ఉన్నాయి.
‘నాచురల్ స్టార్’ నాని నటించిన “ఎంసీఏ” మరియు అఖిల్ నటించిన “హలో” సినిమాలు ఒక రోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా ప్రామిసింగ్ గా కనపడుతున్నాయి. వరుస సక్సెస్ లతో నాని మంచి ఊపులో ఉండగా, ఫస్ట్ హిట్ కోసం అఖిల్ రెండవ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. సంక్రాంతి ముందువరకు ఈ రెండు సినిమాలే ప్రేక్షకులను అలరించేవిగా కనపడుతున్నాయి.
BOTTOM LINE Clueless Film, Forgettable Debut! RATING 1.25/5 Story, Screenplay, Director: Manchala Nagaraj Cast: Maadhav,…
BOTTOM LINE Second Half Drowns RATING 2/5 Story, Screenplay, Director: Mathimaran Pugazhendhi Cast: Soori, Suhas,…