
Producer Naga Vamsi's appeal to help Lenin enter the Rs 100 crore club has sparked debate over box office pressure on Akhil.
ఒక సినిమా బాగా ఆడుతుంది లేదా ఆడింది అనేదానికి కచ్చితంగా కలెక్షన్స్ ప్రామాణికం. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎంత కలెక్ట్ చేస్తే అంత పెద్ద హిట్ అనేది ఇండస్ట్రీ మాత్రమే కాదు.. ఆడియన్స్ కూడా నమ్మే మంత్రం.
అయితే.. డీసెంట్ టాక్ తో జనాల్లో మంచి బజ్ తో నడుస్తున్న సినిమాకి సక్సెస్ రేంజ్ అనేది ఈ కలెక్షన్స్ తో ప్రూవ్ చేసుకోవాల్సి రావడం అనేది పెద్ద టెన్షన్ గా మారింది. అందుకు నిదర్శనం రీసెంట్ గా రిలీజైన “లెనిన్”.
రిలీజ్ కి ముందు నుంచి సినిమా మీద మంచి పాజిటివ్ బజ్ ఉంది, రిలీజ్ కి డిసెంట్ ఓపెనింగ్స్ & రివ్యూస్ వచ్చాయి. సినిమా చూసినవాళ్ళందరూ అఖిల్ బాగా చేశాడు, అఖిల్ కి మంచి హిట్ దొరికింది అని సంతోషపడ్డారు కూడా.
అయితే.. ఇప్పుడు “లెనిన్”ని 100 కోట్ల క్లబ్ లో చేర్పించేందుకు నిర్మాత నాగవంశీ పడుతున్న కష్టం అనేది చర్చనీయాంశంగా మారింది. నిన్న సక్సెస్ మీట్ లో నాగవంశీ మాట్లాడుతూ.. ఈవారం కూడా మా “లెనిన్” సినిమాని చూసి ఆదరించండి, అఖిల్ కి ఈ సినిమాతో 100 కోట్ల కలెక్షన్స్ ఇద్దాం అంటూ ఆడియన్స్ ను రిక్వెస్ట్ చేశారు.
గతంలో బన్నీవాసు కూడా “తండేల్” విషయంలో నాగచైతన్యకి 100 కోట్ల సినిమా ఇస్తున్నాం అని విడుదలకి ముందే ప్రకటించి, సినిమాని 100 కోట్ల క్లబ్ లో చేర్చడానికి చాలా కష్టపడ్డాడు. చెప్పినట్లుగా 100 కోట్ల రూపాయల పోస్టర్లు రిలీజ్ చేశాడు కానీ.. తర్వాత ఆ కలెక్షన్స్ గురించి మాట్లాడడానికి మాత్రం అస్సలు ఇష్టపడలేదు.
ఇప్పుడు నాగవంశీ కూడా ఇదే విధంగా 100 కోట్ల పోస్టర్ వాల్యూ కోసం ప్రాకులాడుతుండడం అనేది సినిమా మీద, అఖిల్ మీద అనవసరమైన ప్రెజర్ పెట్టడమే అవుతుంది తప్ప, సినిమాకి పెద్ద ఉపయోగం ఉండదు.
మేం వేసే కలెక్షన్స్ పోస్టర్లు ఫేక్ అని స్వయంగా ప్రకటించుకునే నిర్మాతలు ఇంకా ఈ వందల కోట్ల పోస్టర్ల కోసం వెంపర్లాడుతుండడం అనేది హాస్యాస్పదం.
Akhil కి ఫస్ట్ 100 Crore మూవీ ఇవ్వాలి!
– #NagaVamsi pic.twitter.com/hOgDo1Xses
— M9 NEWS (@M9News_) July 15, 2026
Srikanth Odela’s The Paradise is carrying huge expectations. The Nani starrer is finally locked for…
Director Parasuram Petla is lining up a big-budget film with the producers of HanuMan. As…