
అఖిల్ వయసు కేవలం 22 సంవత్సరాలే కావడం… అఖిల్ కంటే శ్రియ వయసులో పెద్దది కావడం నాగార్జునకు నచ్చలేదట. ఇదే విషయం గురించి అఖిల్ కు నచ్చజెప్పేందుకు నాగ్ ప్రయత్నించారట. అంతేకాదు నాగచైతన్య కూడా అఖిల్ కు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడట. అయినా అఖిల్ వినకపోవడంతో… వారి పెళ్లికి నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో, ఇటలీలోని రోమ్ లో పెళ్లి ఏర్పాట్లు చేసేందుకు నెల రోజుల క్రితం అఖిల్, శ్రియా భూపాల్, ఆమె తల్లి బయల్దేరారట.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో అఖిల్ – శ్రియల మధ్య విభేదాలు తలెత్తాయట. ఈ క్రమంలో విమానాశ్రయంలో వారిద్దరూ బహిరంగంగానే వాదనకు దిగారట. ఆ తర్వాత వారిద్దరికీ గుడ్ బై చెప్పేసి… అఖిల్ ఇంటికి వెళ్లిపోయాడట. అఖిల్ ను వారించే ప్రయత్నం శ్రియ కాని, ఆమె తల్లి కాని చేయలేదట. ఆ తర్వాత వీరిద్దరినీ కలిపే ప్రయత్నాన్ని ఇటు నాగార్జున, అటు శ్రియ తాత జీవీ కృష్ణారెడ్డి చేసినప్పటికీ… ఫలితం దక్కలేదు. దీంతో చేసేదేమీ లేక నాగ్ సైలెంట్ అయిపోయారట.
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…