
నేను హిట్ కొట్టడానికి రెడీ… మీరు రెడీనా… కొడుతున్నాము…
ఏఎన్నార్ అచ్చు గుద్దినట్టు వీడిలో కనపడుతున్నారు…
మూడు రోజుల క్రితమే కూర్చుని సినిమా అంతా హాయిగా చూసాను…
వస్తున్నాము… బ్లాక్ బస్టర్ కొడుతున్నాం… ఇది ఫిక్స్… ఓకే..!
ఇది క్లుప్తంగా అఖిల్ హీరోగా తెరకెక్కిన రెండవ సినిమా “హలో” ఆడియో వేడుక మీద అఖిల్ మరియు నాగార్జునలు చేసిన కామెంట్స్. ‘మనం’ చిత్ర దర్శకుడు విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన “హలో” సినిమా విజయంపై పూర్తి నమ్మకాన్ని నాగ్, అఖిల్ లు ప్రదర్శించారు. “సోగ్గాడే చిన్నినాయనా” సినిమా నుండి ప్రారంభించిన ‘వస్తున్నాం… కొడుతున్నాం…’ అనే ట్యాగ్ లైన్ ను నాగ్ “హలో” విషయంలో కూడా వాడడంతో అభిమానులు కూడా ఈ సినిమా సక్సెస్ పట్ల నమ్మకం పెంచుకున్నారు.
రెండేళ్ళ నుండి సినిమా లేకపోయినా, తాను ఏ చిన్న యాడ్ చేసినా తనపై చూపించిన అభిమానానికి ఫ్యాన్స్ కు కృతజ్ఞతలు తెలిపిన అఖిల్, దర్శకుడు విక్రమ్ కే కుమార్ ను మాత్రం తన సోదరుడుగా అభివర్ణించాడు. తొలి సినిమా విఫలమై అన్ని రకాలుగా తాను ‘డౌన్’ పొజిషన్ లో ఉన్న సమయంలో, తనకు ‘హలో’ లాంటి సినిమా ఇచ్చినందుకు జీవితాంతం రుణపడి ఉంటానని, తన కోసం ఎప్పుడు ఏదైనా చేస్తానని ఆడియో వేడుకపై బహిరంగంగా వ్యాఖ్యానించాడు అఖిల్. నిజానికి తన కన్నా ‘బెస్ట్ యాక్టర్స్’తో పనిచేసే రేంజ్ లో విక్రమ్ ఉన్నాడని, అయినప్పటికీ తనతో సినిమా చేయడం మరిచిపోలేని విషయమని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
తెలుగు ఇండస్ట్రీకి డ్యాన్స్ లు, గ్రేస్ లు నేర్పింది ఏఎన్నార్ గారు, వీడిని చూస్తుంటే అచ్చు ఏఎన్నార్ లా కనపడుతున్నాడు, తాను తొలినాళ్ళల్లో చేసిన సినిమాలు చూస్తుంటే, ఇప్పుడు వీడు చేస్తున్న సినిమా చూస్తే, తామేం చేసాం అనిపిస్తోందని, మూడు రోజుల క్రితమే సినిమాను హాయిగా చూశానని, “వస్తున్నాం… బ్లాక్ బస్టర్ కొడుతున్నాం… ఇది ఫిక్స్…” అంటూ నాగ్ చేసిన కామెంట్స్ తో అభిమానుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. మరి నాగ్ బ్రాండ్ అంబాసిడర్ గా మారిన ‘వస్తున్నాం… కొడుతున్నాం…’ వ్యాఖ్యలను “హలో” నిలబెడుతుందో లేదో డిసెంబర్ 22వ తేదీన తేలిపోనుంది.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…