
హీరోగా తెరంగేట్రం చేసి దాదాపు దశాబ్దం కావస్తున్నా.. నటుడిగా కానీ కథానాయకుడిగా కానీ సరైన స్థాయి గుర్తింపు సంపాదించుకోలేకపోయాడు అఖిల్. “హలో”తో హిట్ కి ఆమడ దూరంలోనే ఆగిపోయిన అఖిల్, “ఏజెంట్”తో మాత్రం పొలిమేర మాటుకు తిరిగెళ్లిపోయాడు.
ఆ తర్వాత ఒక సినిమా ఓకే చేయడానికి అఖిల్ చాలా సమయం తీసుకున్నాడు. ఎట్టకేలకు “లెనిన్”తో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చాన్నాళ్ళపాటు ప్రొడక్షన్ లో ఉన్న “లెనిన్” ఎట్టకేలకు జూన్ లో రిలీజ్ కి రెడీ అయ్యింది.
మార్చిలో విడుదలవ్వాల్సిన సినిమా “పెద్ది” కోసం పోస్ట్ చేశామంటూ జూన్ నెలలో విడుదల తేదీ ప్రకటించారు. ఇప్పుడు “పెద్ది” కూడా జూన్ లో, అది కూడా 25 వ తారీఖునే విడుదలకి సన్నద్ధమవుతుండడంతో “లెనిన్” సంగతేంటా అనే సందేహాలు మొదలయ్యాయి.
అయితే టాక్సిక్ పోస్ట్ పాన్ అవ్వడంతో జూన్ 4 కి “పెద్ది” ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా అనుకున్నారు. కానీ.. నాగార్జున మాత్రం “లెనిన్” రిజల్ట్ పై కాన్ఫిడెంట్ గా ఉండడం, మార్క్ చేసుకోండి అని ట్వీట్ చేయడంతో సినిమాకి బజ్ వచ్చింది.
ఇకపోతే.. ఇలాంటి తరుణంలో అఖిల్ గనుక “పెద్ది”తో పోటీ పడితేనే మంచి హైప్ క్రియేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిజినెస్ పరంగా కాస్త ఎఫెక్ట్ ఉండొచ్చు కానీ.. హైప్ పరంగా బాగానే యూజ్ అవుతుంది పెద్దితో క్లాష్. మరి నాగ్, అఖిల్, నాగవంశీ ఈ క్లాష్ ను క్యాష్ చేసుకుంటారా లేదా అనేది చూడాలి.
India's 351/7 looked like a strong enough total, but the third ODI against West Indies…
Legendary filmmaker Singeetham Srinivasa Rao has passed away at Kauvery Hospital in Chennai following ill…