
“నాకు బాగా గుర్తు… చిన్నప్పుడు లారెన్స్ స్కూల్లో నన్ను వదిలిపెట్టడానికి నాన్న వచ్చినప్పుడు, నేను చాలా ఏడ్చాను. నాన్న షర్టు పట్టుకుని పీకితే బటన్స్ అన్నీ ఊడిపోయాయి… ఫ్యాక్షన్ పరిస్థితులు కారణంగా నాన్న ప్రయాణిస్తున్న జీపులో ఎక్కాలన్నా భయపడే వాళ్లం. ఆళ్లగడ్డ నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే… ఒకే రూటులో వెళ్లే వాళ్లం కాదు… ఓన్లీ నైట్ జర్నీస్ చేసే వాళ్లం… ఒకే డ్రైవర్ ఉండేవాడు కాదు… మారుస్తూ ఉండే వాళ్లం… నాకు చదువులో స్టేట్ ర్యాంక్స్ రాకపోయినా ఫర్వాలేదు… పాసయితే చాలు నేను హ్యాపీగా ఉంటానని నాన్న అనేవారు… ఉన్నన్ని రోజులు మమ్మల్ని సంతోష పరచాలని చూశారని” చెప్పుకొచ్చింది.
రోడ్డు ప్రమాదంలో అమ్మ మృతి చెందిన తర్వాత నా మైండ్ లో నుంచి మ్యారేజ్ చేసుకోవాలనే విషయాన్నే తీసేశాను. అయితే నాన్న నాకు సర్ది చెప్పడంతో పెళ్లి చేసుకున్నాను. ఆ రోజు నాన్న చెప్పిన మాటలు నా మైండ్ లో ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. అమ్మ పోయిన తర్వాత నాన్న ఉండలేకపోయారని నా ఫీలింగ్. అమ్మ వీడియోస్ చూపించమని పదే పదే మమ్మల్ని అడిగేవారు. అయితే ఆ వీడియోస్ చూసి నాన్న మరింత కుంగిపోతాడనే భయంతో మేము ఆ వీడియోలను పెట్టే వాళ్లం కాదు.
ఆ వీడియోలు పెట్టకపోయినా, నాన్న మనసులో అమ్మ గురించిన ఆలోచనలే ఉంటాయని తెలుసు. అమ్మ, నేను సరదాగా కొట్టుకునే వాళ్లం. అప్పుడు, నాన్న మరింత నన్ను ఎంకరేజ్ చేసేవారు. మా తమ్ముడు కూడా మా నాన్నను సరదాగా ‘ఏం నాగిరెడ్డి’ అంటూ సరదాగా పిలిచేవాడు.. నాన్న చెస్ బాగా ఆడేవారు. బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్ కూడా బాగా ఆడేవారని తన తల్లిదండ్రులతో తన అనుబంధాన్ని మౌనిక గుర్తు చేసుకుంది. చిన్న వయసులోనే తల్లితండ్రులను దూరం చేసిన ఆ కుటుంబానికి అన్నీ తానై ఉంటానని ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే.
Allari Naresh is officially back in top form with Ramba Oorvasi Menaka, reminding everyone of…
The Congress leadership took the tough call of firing Konda Surekha from her Cabinet position…