
చివరికి నాగచైతన్య, సమంత కూడా పెద్దగా పాలుపంచుకోలేదు. దీనితో ఏదో ఉందని అంతా అనుమాన పడ్డారు. అయితే ఈ రోజు విడుదలైన సినిమా చూశాకా ఈ విషయంగా కొత్త అనుమానాలు వస్తున్నాయి. సినిమాలో ఎక్కువగా వెంకటేష్ నే హైలైట్ చేశారు. మల్టీస్టారర్ అనేకంటే వెంకటేష్ సినిమాలో చైతన్య కీలక పాత్రలో కనిపించాడు అనేలా ఉంది.
ఈ కారణంగానే అక్కినేని ఫ్యామిలీ నొచ్చుకుని ప్రమోషన్స్ కు దూరం అయ్యిందా అనే కొత్త అనుమానాలు బయలుదేరాయి. ఇది ఇలా ఉండగా సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ మరియు సింగల్ స్క్రీన్ ఆడియన్స్ సినిమాను ఎలా ఆదరిస్తారు అనేదాని మీదే సినిమా భవితవ్యం ఆధారపడి ఉంది.
ముఖ్యంగా సెకండ్ హాఫ్ ను డైరెక్టర్ బాబీ సరిగా హేండిల్ చెయ్యలేకపోవడం వల్లే టాక్ తేడా వచ్చింది అంటున్నారు విమర్శకులు. ఇద్దరు స్టార్ హీరోలు దొరికినా దర్శకుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. వెంకీ మామ చిత్రం ఒక్క సీడెడ్ లో తప్ప రెండు తెలుగు రాష్ట్రాలలో అన్ని చోట్లా సురేష్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారానే విడుదల అయ్యింది.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆయన సోదరి షర్మిలకు మధ్య ఆస్తి వివాదాలు అందరికీ తెలిసిందే. అయితే ఆ వివాదాలు…
Prabhas is undoubtedly one of the biggest superstars in Indian cinema. Since the release of…