Telugu

ట్రైలర్ టాక్ – ‘జనతా గ్యారేజ్’కు గట్టి పోటీ గ్యారెంటీ!

సినిమాల ఆదరణకు భాష అడ్డు కాదు అన్న విషయం గతంలో చాలా సందర్భాలలో రుజువైంది. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలకు దేశమంతా మార్కెట్ ఉంటుంది. అలాంటి ఓ బాలీవుడ్ సినిమానే జూనియర్ ఎన్టీఆర్ “జనతా గ్యారేజ్” సినిమాకు గట్టిపోటీ ఇవ్వనుందన్న సంకేతాలను “రుస్తుం” ధియేటిరికల్ ట్రైలర్ బలపరిచింది. అక్షయ్ కుమార్, ఇలియానాలు జంటగా నటించిన ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగగా, చివరికి ఆగష్టు 12 విడుదల అని రాగానే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో మరో బాంబు పడినట్లయ్యింది.

ADVERTISEMENT

‘రుస్తుం పర్వి’ అనే ఒక నావెల్ ఆఫీసర్ జీవితగాధ వెండితెర రూపమే ఈ ‘రుస్తుం’ సినిమా. తన భార్య మరొకరితో ఎఫైర్ సాగిస్తుందని తెలుసుకుని, అతన్ని చంపివేసాడని జైలులో పెట్టిన రుస్తుంకు ప్రజల మద్దతు ఎలా లభించింది? ఈ కేసు నుండి రుస్తుం ఎలా బయటపడ్డాడు? అలాగే నావెల్ అధికారిగా తన బాధ్యతలను దేశం కోసం ఎలా నిర్వర్తించాడు? అన్న కధను ఆసక్తికరంగా మలిచినట్లుగా కనపడుతోంది. ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఆగష్టు 12వ తేదీనే హృతిక్ చారిత్రాత్మక సినిమా కూడా విడుదల కానుండడంతో, ఈ రెండు సినిమాల నుండి ‘జనతా గ్యారేజ్’కు గట్టి పోటీ తప్పేలా లేదు. దీంతో ‘బుడ్డోడు’ అభిమానుల్లో ఒకింత ఆందోళన నెలకొనడం సహజమే. మరీ కాలం కలిసి వస్తే… రజనీకాంత్ ‘కబాలి’ కూడా ఆగష్టు మొదటి, రెండవ వారాలలోనే విడుదల కావచ్చన్న టాక్ ఉంది. ఇదే నిజమైతే… ‘జనతా గ్యారేజ్’ వాయిదా పడడం తధ్యం అన్న సమాచారం కూడా ట్రేడ్ వర్గాల నుండి వ్యక్తమవుతోంది.

Share
Akhil

Akhil, a passionate young writer, started his journey at M9 News and has since become a key member of the team. With a deep love for Telugu cinema, Hyderabad city news, and a keen interest in general affairs, Akhil br…

Published by

Recent Posts

Indian Arrested for Sexually Assaulting Teen Girl

Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…

34 minutes ago

Jagame Sangeetham Review: Superficial Remake, A Major Misfire

BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…

49 minutes ago